ఎంత చించుకుంటే ఏం లాభం శ్రద్ధా?

0

కడుపు చించుకుంటే కాళ్లపై పడుతుందంటారు! శ్రద్ధా ఎంత చించుకున్నా ఏం ఉపయోగం? పిలిచి అవకాశం ఇచ్చే నాధుడే లేడాయె. కెరీర్ ఆరంభమే తనకంటూ వ్యాంప్ బ్రాండ్ పడిపోవడం ఒక రకంగా కథానాయికగా తన అవకాశాలకు చెక్ పెట్టేసిందనే చెప్పాలి. ఆర్య చిత్రంలో ఒక వ్యాంపు తరహా పాత్రలోనే శ్రద్దా నటించింది. దాని ప్రభావం అంతా ఇంతా కాదు. అందాల్ని ఆరబోయడానికి ఏమాత్రం అభ్యంతరం చెప్పని భామగా ఒక ముద్ర పడిపోయింది. దాంతో గుంటూర్ టాకీస్ – మొగుడు లాంటి చిత్రాల్లో శ్రద్ధాకి ఆ తరహా పాత్రలే వచ్చాయి.

పాతిక సినిమాల్లో నటించినా అవేవీ తనకు కలిసి రాలేదు అంటే దానికి కారణం తనకంటూ ఒక స్థాయి లేకపోవడమేననడంలో సందేహం లేదు. ఇక ఆరబోత ఒక్కటే ఇక్కడ ముఖ్యం కాదు.. ఇంకా ఎన్నో ఫ్యాక్టర్స్ కథానాయికల జీవితాల్ని కెరీర్ ని ప్రభావితం చేస్తుంటాయి. అయితే ఆ లోపం ఎక్కడ ఉంది? అన్నది వెతకడంలోనూ శ్రద్ధా వెనకబడిపోయిందనే చెప్పాలి. గుంటూర్ టాకీస్- డిక్టేటర్-పీఎస్వీ గరుడవేగ- ఉద్ఘర్ష-హిప్పీ వంటి చిత్రాల్లో నటించింది. ఎక్కడా అదృష్టం కలిసి రాలేదు. దీంతో కన్నడ- బెంగాలీ భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. `కోటి గొబ్బ 3` అనే చిత్రంలో నటించినా అది కూడా మైలేజ్ అవ్వలేదు.

ఇకపోతే వీటన్నిటినీ మించి శ్రద్ధా సోషల్ మీడియా క్వీన్ గా వెలిగిపోతోంది. గత కొంతకాలంగా ట్విట్టర్ ఇన్ స్టాల్లో వేడెక్కించే ఫోటోషూట్లతో అగ్గి రాజేస్తోంది. చాలా కాలంగా సోషల్ మీడియాలో శ్రద్ధా ట్రీట్ యూత్ ని మత్తెక్కించేస్తోంది. రెగ్యులర్ గా రెచ్చిపోయి బికినీ షోలు ఇస్తున్న ఫోటోల్ని- వీడియోల్ని ఇన్ స్టాలో రివీల్ చేస్తోంది. ఇక బికినీల్లో నాభి అందాన్ని.. నడుము సొగసును.. ఇంచి ఇంచి ఎలివేట్ చేస్తోంది. ఇంతకుముందు మాల్దీవుల వెకేషన్ నుంచి ఈ తరహాలో బికినీ ఫోటోల్ని రివీల్ చేసిన సంగతి తెలిసిందే. శ్రద్ధాలో ఎంతగా ఎగ్జిబిషనిజమ్ ఉన్నా.. అదేదీ కెరీర్ కి కలిసి రాలేదు. కనీసం ఈసారైనా ఒక కొత్త దారి దొరుకుతుందేమో చూడాలి.
Please Read Disclaimer