ఒంటరి దీవుల్లో శ్రద్ధా బికినీ సెలబ్రేషన్

0

అందాల్ని ఆరబోయడానికి ఏమాత్రం అభ్యంతరం చెప్పని భామగా శ్రద్ధా దాస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. గుంటూర్ టాకీస్ – మొగుడు లాంటి చిత్రాల్లో శ్రద్ధా అందాల ఆరబోత హీటెక్కించిన సంగతి తెలిసిందే. `సిద్ధూ ఫ్రమ్ సికాకుళం` చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శ్రద్ధాదాస్ కెరీర్ ఆరంభం చక్కని అవకాశాల్ని అందుకున్నా కాలక్రమంలో అందాల ఆరబోత శ్రుతి మించి ఆ తరహా పాత్రలకే పరిమితమైంది. టాలీవుడ్ లో 20 చిత్రాల్లో నటించినా శ్రద్ధాదాస్కు మాత్రం ఆశించిన గుర్తింపు మాత్రం దక్కలేదు. ఎప్పటికప్పుడు తన టాలెంట్ని నిరూపించుకోవాలని మళ్లీ తెలుగు తెరపై వెళగాలని ప్రయత్నాలు చేస్తూనే వుంది. అయితే తాను ఆశించిన లక్ కలిసి రాలేదు.

ఇటీవల గుంటూర్ టాకీస్- డిక్టేటర్-పీఎస్వీ గరుడవేగ- ఉద్ఘర్ష-హిప్పీ వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఏవీ కలిసిరాలేదు. గుంటూర్ టాకీస్ లో రష్మీ డామినేట్ చేస్తే పీఎస్ వీ గరుడవేగలో సన్నీలియోన్ నుంచి కాంపిటీషన్ ఎదుర్కొంది. హిప్పీతో అయినా మళ్లీ రెచ్చిపోవాలని ప్రయత్నించినా దిగాంగన సూర్యవంశీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో కన్నడ- బెంగాలీ భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ప్రస్తుతం `కోటి గొబ్బ 3` అనే చిత్రంలో నటించింది.

ప్రస్తుతం ఈ భామ ఒంటరి దీవుల విహారంలో ఉంది. ప్రఖ్యాత బాలీ దీవుల్లో బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో వేడెక్కిస్తోంది. విటమిన్ -డి కోసమే ఈ పాకులాట అంటూ ఫ్లోరల్ బికినీ ఫోటోల్ని ట్విట్టర్ లో రివీల్ చేసింది. ప్రకృతి అందాల నడుమ ఉన్న ఓ రిసార్ట్ లో సేదదీరుతూ శ్రద్ధా చిలౌట్ చేస్తున్న ఫోటోలు అంతర్జాలాన్ని హీటెక్కిస్తున్నాయి.
Please Read Disclaimer