శ్రద్ధ.. ఫస్ట్ టైమే అలా దొరికిపోయిందట!

0

‘సాహో’ విడుదలకు మరో పదిరోజుల సమయమే ఉండడంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. లీడ్ పెయిర్ ప్రభాస్ – శ్రద్ధా కపూర్ ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో శ్రద్ధ తనకు సంబంధించిన ఒక పర్సనల్ విషయాన్ని వెల్లడించింది. అదో భయంకరమైన అనుభవం అని చెప్పింది.

ఇంతకీ ఏం జరిగిందంటే కొన్నేళ్ళ క్రితం శ్రద్ధ తన ఫ్రెండ్స్ తో కలిసి మొదటి సారిగా కాస్త మద్యం పుచ్చుకుందట. అయితే తన బ్యాడ్ లక్ కొద్ది ఇంటికి వచ్చేసరికి అమ్మగారు “శ్రద్ధ ఎప్పుడు ఇంటికి వస్తుందా” అని కాచుకొని కూర్చుని ఉన్నారట. అసలే శ్రద్దకు చుక్కేసుకోవడం మొదటిసారి. పైగా ఇన్నర్ ఫీలింగ్స్ వింతవింతగా అనిపిస్తూ ఉన్న సమయంలో అమ్మ చేతికి చిక్కడం తెగ ఇబ్బందిగా అనిపించిందట. కాస్త కిక్కు ఎక్కువగా ఉండడంతో వింతగా ప్రవర్తించానని.. ఎక్కువగా నవ్వానని తెలిపింది. ఇలా మొదటిసారే పట్టుబడడం ఓ భయంకరమైన అనుభవం అని వెల్లడించింది. జన్మలో మందు చుక్క ముట్టని వారికి ఇలాంటి ఇబ్బందులు ఉండవు కానీ మందు బాబులకు..పాపలకు ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే పరిస్థితే ఇది.

ఇదిలా ఉంటే ‘సాహో’ గురించి మాట్లాడుతూ తన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందని.. ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తానని తెలిపింది. కొన్ని డేంజరస్ యాక్షన్ స్టంట్స్ కూడా చేశానని.. ఇలాంటి స్టంట్స్ చేయడం మొదటిసారని వెల్లడించింది. మరి ఈ భామ ఎలా ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలంటే ఆగష్టు 30 వరకూ వేచి చూడాల్సిందే.




Please Read Disclaimer