సానియా బయోపిక్ డ్రీమ్.. ఏం చెప్పిందిలే?

0

`సాహో` రిలీజ్ డార్లింగ్ టీమ్ ని టెన్షన్స్ పెట్టేస్తున్న సంగతి తెలిసిందే. జస్ట్ 2 డేస్ ఓన్లీ.. అందుకే ప్రచారం పరంగా ఏమరుపాటు అన్నదే లేకుండా ప్రభాస్- శ్రద్ధా కపూర్ బృందం చాలా హార్డ్వర్క్ చేస్తోంది. శ్రద్ధా ఓవైపు సాహో ప్రమోషన్స్ చేస్తూనే మరోవైపు చిచ్చోర్ ప్రమోషన్స్ కి ఎటెండ్ అవుతోంది. అయితే ఈ ప్రచారంలో శ్రద్ధాకు పలు ఆసక్తికర ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

`సాహో` ప్రచార ఇంటర్వ్యూలో ఆన్ లొకేషన్ అనుభవాల గురించి చెప్పిన శ్రద్ధా.. హైదరాబాదీ సోయగం సానియా బయోపిక్ పై ఆసక్తిని కనబరిచింది. బ్యాడ్మింటన్ స్టార్ సానియా జీవితకథలో నటించే అవకాశం వస్తే ఏమాత్రం వదిలిపెట్టనని తెలిపింది శ్రద్ధా. అయితే సానియా బయోపిక్ నే ఎందుకు చేయాలనుంది? అని అడిగితే సానియా లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్ స్పయిరింగ్ గా ఉంటుంది. అందుకే తన రోల్ చేయాలని అనుకుంటున్నాను అని సమాధానం ఇచ్చింది. అయితే ఇప్పటికే సానియా జీవితకథను హిందీలో సినిమాగా తీయడానికి ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా హక్కులు తీసుకున్నారు. అయితే ఈ బయోపిక్ లో నటించే అవకాశం శ్రద్ధా కు లభిస్తుందా? తనకే ఆ లక్ చిక్కుతుందా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్.

టెన్నిస్ క్వీన్ సానియా హైదరాబాదీ కాబట్టే ఇలా తెలుగు ఆడియెన్ కి చేరువయ్యేందుకు బిస్కెట్ వేస్తోందా? అన్న సందేహాలు కలగక మానవు. ఇదివరకూ హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటించే అవకాశం వచ్చినా ఎందుకని చేయలేదు? ..ఆ రోల్ కోసం చాలా కాలం బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేసి మధ్యలోనే ఆ ప్రాజెక్టును ఎందుకు వదిలేసినట్టు? ఈ ప్రశ్నలకు శ్రద్ధా వైపు నుంచి సరైన ఆన్సర్ అయితే లేదు. వేరే సినిమాల బిజీలో వదిలేసిందని చెబుతున్నా.. ఇంటర్నల్ రీజన్స్ ఏమిటో తెలీనేలేదు. ప్రస్తుతం సాహో రిలీజ్ ప్రచారంలో ఈ అమ్మడు బిజీ బిజీ. తదుపరి చిచ్చోర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అటుపై `స్ట్రీట్ డ్యాన్సర్ 3డి` వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
Please Read Disclaimer