బీచ్ లో స్నేహితుడితో సాహో బ్యూటీ

0

సాహో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన శ్రద్దా కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా టాప్ స్టార్ హీరోయిన్ గా దూసుకు పోతుంది. ఈమె స్టార్ డం మరింత పెంచేలా తాజాగా నటించిన ‘భాగీ 3’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా తో ఈ అమ్మడి క్రేజ్ మరింతగా పెరిగింది. టైగర్ ష్రాఫ్ తో కలిసి ఆ సినిమాలో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ శ్రద్దా ప్రస్తుతం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ కనిపించింది.

తాజాగా ఈ అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫొటోను షేర్ చేసింది. స్నేహితుడితో బీచ్ లో అంటూ కుక్కతో కలిసి బీచ్ లో సేదతీరుతున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ అమ్మడు షేర్ చేసిన ఈ హాట్ ఫొటోకు ఏకంగా రెండు మిలియన్ లకు పైగా లైక్స్ వచ్చాయి. శ్రద్ద కపూర్ స్నేహితుడి గురించి కూడా సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

శ్రద్ద ఒడిలో ఒదిగి పోయి ఉన్న ఆ కుక్క ఎంత అదృష్టం చేసుకుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే హీరోల కంటే కూడా ఆ కుక్క చాలా లక్కీ అంటూ మరికొందరు మీమ్స్ చేస్తున్నారు. మొత్తానికి శ్రద్దా పోస్ట్ చేసిన స్నేహితుడితో బీచ్ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం హిందీ లో మూడు పెద్ద సినిమాల్లో నటించడం తో పాటు ఇంకా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. సౌత్ లో మరో సినిమాలో ఈమెతో నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నా ఈమె మాత్రం ఆసక్తి చూడం లేదటని కూడా వార్తలు వస్తున్నాయి. కేవలం బాలీవుడ్ పైనే ఈమె దృష్టి అంతా అన్నట్లుగా ఉంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-