హెలీకాఫ్టర్ అయినా షేకవ్వాలి

0

సిక్సర్ గల్లీలో కాదు.. స్టేడియంలో కొడితే ఒక రేంజు ఉంటుంది! అంటూ పంచ్ విసిరాడు డార్లింగ్ ప్రభాస్. అంతటి మొనగాడే పాన్ ఇండియా మూవీ `సాహో` కోసం ఏరి కోరి శ్రద్ధా కపూర్ ని ఎంపిక చేసుకున్నాడు. ఆ మూవీలో లేడీ పోలీసాఫీసర్ గా శ్రద్ధా చక్కగా ఒదిగిపోయి నటించింది. ఇక పోలీస్ అధికారిగా కంటే ప్రభాస్ తో రొమాన్స్ పండించే యువతిగా శ్రద్ధా మరింతగా లీనమై నటించింది. అందుకే ప్రభాస్ అభిమానుల్లో ఇప్పటికీ కొలువై ఉంది.

సాహో తర్వాత దక్షిణాదినా శ్రద్ధా కపూర్ కి పాపులారిటీ పెరిగింది. శ్రద్ధా పై ఇంట్రెస్ట్ తోనే ఇటీవలే రిలీజైన స్ట్రీట్ డ్యాన్సర్ 3డి కి మెట్రో సిటీస్ లో జనం పోటెత్తారు. అయితే సినిమాలో దమ్ము లేకపోవడంతో ఓపెనింగ్ డే ఉన్న స్పీడ్ ఆ తర్వాత లేకుండా పోయింది. ఇక శ్రద్ధా కపూర్ డ్యాన్సింగ్ ట్యాలెంట్ గురించి బయటి ప్రపంచానికి ఏబీసీడీ సిరీస్ తోనే తెలిసింది. తనో స్పీడ్ డ్యాన్సర్ అన్న సంగతిని స్ట్రీట్ డ్యాన్సర్ 3డి మరోసారి రివీల్ చేసింది.

ప్రస్తుతం భారీ యాక్షన్ చిత్రం `భాఘి 3`లో నాయికగా నటించింది. ఇందులో టైగర్ ష్రాఫ్ లాంటి ట్యాలెంటెడ్ స్టార్ సరసన శ్రద్దా కపూర్ ఆడిపాడింది. ఇటీవలే రిలీజైన సాంగ్ లో శ్రద్ధా బికినీ ట్రీట్ కుర్రకారులో హాట్ టాపిక్ అయ్యింది. స్టెప్పు స్టెప్పుకి శ్రద్ధా రకరకాల బికినీలతో చెలరేగిపోయింది. తాజాగా ఈ పాటలోని హాట్ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. అందులో రెడ్ హాట్ బికినీ ఒకటి ఫ్యాన్స్ లో అంతే స్పీడ్ గా దూసుకుపోతోంది. 2018 -19 సీజన్ క్షణం తీరిక లేనంత బిజీ షెడ్యూల్స్ తో శ్రద్ధా టాప్ రేంజ్ హీరోయిన్ గా వెలిగిపోయిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer