వైట్ ఈజ్ సూపర్ హాట్

0

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ‘సాహో’ లో హీరోయిన్ కావడంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ‘సాహో’ కనుక హిట్ అయితే శ్రద్ధా తెలుగులో భారీ గుర్తింపు సాధించడం ఖాయమే. ‘సాహో’ ఆగష్టు 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన వారం లోపే శ్రద్ధ నటించిన మరో హిందీ చిత్రం ‘చిచోరే’ కూడా రిలీజ్ అవుతోంది. దీంతో రెండు సినిమాలకు ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉంది. ‘దంగల్’ దర్శకుడు నితీష్ తివారి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించాడు. మన తెలుగు ‘ఏజెంట్ ఆత్రేయ’ నవీన్ పోలిశెట్టి ఈసినిమాలో ఒక కీలకమైన పాత్ర పోషించడం విశేషం.

రీసెంట్ గా శ్రద్ధ ‘చిచోరే’ ప్రమోషన్స్ లో పాల్గొంది. ఈ సందర్భంగా అందమైన దుస్తులు ధరించి ఫోటో షూట్ కూడా చేసింది. శ్రద్ధ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. అందుకే తన ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలను ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలో శ్రద్ధ ఒక వైట్ కలర్ గౌన్ లాంటి షర్టు వేసుకుంది.. నడుముకు బెల్ట్ డిజైన్ ఉండే వెడల్పాటి క్లాత్ ఉండడంతో ఇదో డిఫరెంట్ డ్రెస్ లాగా కనిపిస్తోంది. తలకు కొప్పు కట్టి పర్ఫెక్ట్ మేకప్ తో ఒక ఆధునిక యువతి తరహాలో కనిపిస్తోంది. రెండు చేతులను గోడకు ఆన్చి ఒకవైపుకు తిరిగి పోజివ్వడంతో మోడల్ లాగా ఉంది.

శ్రద్ధా షేర్ చేసిన ఈ ఫోటోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. “వైట్ ఈజ్ సూపర్ హాట్”.. “డీసెంట్ చిచోరా”.. “బ్యూటీ క్వీన్” అంటూ కామెంట్లు పెట్టారు. ఈ ఫోటోకు దాదాపు వన్ మిలియన్ లైక్స్ వచ్చాయి. శ్రద్ధ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ‘సాహో’.. ‘చిచోరే’ కాకుండా ‘స్ట్రీట్ డ్యాన్సర్’ అనే చిత్రంలో కూడా కూడా నటిస్తోంది.
Please Read Disclaimer