తన టీమ్ మెంబర్ల మనసు దోచిన సాహో భామ

0

ఒక సినిమాకు పని చేయడం అనేది నటీనటులకు.. టెక్నిషియన్స్ కు ఎప్పుడూ కొత్త అనుభవమే. ఎందుకంటే ఒకసారి పని చేసిన టీమ్ తో మరోసారి పని చేస్తారని గ్యారంటీ ఏమీ ఉండదు. అందుకే ఏ సినిమా అయిన దేనికదే ప్రత్యేకం. ఇక ‘సాహో’ లాంటి క్రేజీ ప్రాజెక్టు అయితే మరింత ప్రత్యేకం అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రద్ధ కపూర్ కు కూడా అదే ఫీలయింది.

సాహో షూటింగ్ ఈమధ్యే పూర్తయింది. ఆస్ట్రియా దేశంలో జరిగిన షెడ్యూల్ తో పాటల చిత్రీకరణ ముగియడంతో సాహో దాదాపు రెండేళ్ళ జర్నీ చివరిదశకు వచ్చింది. సహజంగా ఇలాంటి సమయంలో హీరో హీరోయిన్లు సినిమాకు సంబంధించిన ముఖ్యులతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు.. కృతజ్ఞతలు తెలుపుతారు. అయితే హీరోయిన్ శ్రద్ధ కపూర్ తనతో రెండేళ్ళ ప్రయాణం చేసిన పర్సనల్ టీమ్ మెంబర్స్ కు ఒక టచింగ్ మెసేజ్ పెట్టింది. తనకోసం పని చేసిన హెయిర్ స్టైలిస్ట్.. మేకప్.. కాస్ట్యూమ్.. వార్డ్ రోబ్.. స్పాట్.. కాస్ట్యూమ్.. సెక్యూరిటీ అందరికి కృతజ్ఞతలు తెలిపింది. వారు తనపై చూపించిన ప్రేమ.. అభిమానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. చెత్త జోకులు వేయడంలో తనో స్పెషలిస్టు అని.. అయితే వాటిని ఓపిగ్గా భరించారని తెలిపింది. అంతే కాదు వారిపై పిచ్చి కామెంట్లు చేసినప్పుడు కూడా తనపై అదే ప్రేమ చూపారని.. అందుకు వారికి సదా రుణపడి ఉంటానని చెప్పింది. ఈ టీమ్ లో ప్రతి ఒక్క మెంబర్ తనకు ప్రత్యేకమని తెలిపింది. తన టీమ్ మెంబర్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేసిన విషయం కూడా తెలిపింది. ఈ టచింగ్ మెసేజ్ తో పాటుగా తన బృంద సభ్యులతో సరదాగా గడుపుతూ ఉన్న కొన్ని ఫోటోలను కూడా పంచుకుంది.

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’ పై భారీ అంచనాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 15 న ‘సాహో’ ప్రేక్షకుల ముందుకు రానుంది.Please Read Disclaimer