సాహో లుక్: కుర్రాళ్ల గుండెల్లో బుల్లెట్టు

0

సాహో శ్రద్ధ .. ఈ లుక్ చూశారా? `రెసిడెంట్ ఈవిల్` మిలా జోవిచ్ కి.. `సాల్ట్` ఏంజెలినా జోలీకి .. `వండర్ ఉమెన్` గాల్ గాడోట్ కి ఏమాత్రం తీసిపోవడం లేదు. ఆ ముగ్గురూ కలిసి వచ్చినా తనని ఎదురించి నిలవలేరు అనిపిస్తోంది. ఓ రకంగా శ్రద్ధా కపూర్ ఈ ఫిక్షన్ చిత్రంలో హాలీవుడ్ స్టార్లకు తీసిపోని పాత్రలో నటిస్తోందా? అని సందేహం కలగకుండా ఉండదు.

ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత క్రేజీగా తెరకెక్కుతున్న `సాహో`కి సంబంధించిన ప్రతి పోస్టర్ క్యూరియాసిటీని పెంచుతున్నాయి. నిన్ననే ప్రభాస్ – శ్రద్ధా జంటగా కొత్త పోస్టర్ రివీలైంది. అందులో శత్రువుపై భీకరంగా పోరాడుతూ బుల్లెట్లు వర్షం కురిపిస్తున్నారు ఈ జోడీ. హీరో- విలన్ బృందం మధ్యలో అడ్డంకిగా ఉన్న అద్దం గాజు పెంకులు గాల్లో లేచాయ్. శత్రువు గుండెల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లిపోయాయ్. అదంతా చూస్తుంటే ఆ సీన్ లో ప్రభాస్ కి ధీటుగా శ్రద్ధా యాక్షన్ దృశ్యాల్లో కనిపించనుందని అర్థమైంది. ఇదివరకూ రిలీజ్ చేసిన టీజర్.. మేకింగ్ వీడియోల్లోనూ శ్రద్ధా కొన్ని సెకన్ల పాటు మెరుపులు మెరిపించిన సంగతి కళ్ల ముందే కనిపిస్తోంది ఇంకా.

వీటన్నిటినీ మించి తాజాగా రిలీజ్ చేసిన శ్రద్ధా సోలో పోస్టర్ కిర్రాక్ పుట్టిస్తోంది. తుపాకి చేతపట్టి శ్రద్ధా గుళ్ల వర్షం కురిపిస్తోంది. ఆ ఫైరింగ్ కి తుపాకి నుంచి మంటలు చెలరేగుతున్నాయి. ఈ దృశ్యం చూస్తుంటే యాక్షన్ లో మిలా జోవిచ్ – ఏంజెలినా- గాల్ గాడోట్ వీళ్లెవరికీ తీసిపోయేట్టు లేదు. యాక్షన్ క్వీన్ గా స్టంట్స్ అదరగొట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది. డార్క్ లైట్ మోడ్ లో యాక్షన్ చిత్రాలు మనకు తక్కువే. ఆ లోటును కూడా సాహో తీర్చబోతోందని ఈ పోస్టర్ బ్యాక్ డ్రాప్ చూస్తుంటే అర్థమవుతోంది. చీకటి సామ్రాజ్యంలో మాఫియాకి ఎదురెళ్లే సాహసనారిలా శ్రద్ధా కనిపిస్తోంది. ఆగస్టు 15 అన్నిటికీ సమాధానం లభించనుంది. అప్పటివరకూ వేచి చూడాల్సిందే.
Please Read Disclaimer