అప్ ఎబోవ్ ది వరల్డ్ సో హై.. అంటున్న శ్రద్ధ!

0

ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాల్లో.. ఈ ఏడాది రిలీజ్ కానున్న సినిమాల్లో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ ఏది? నిస్సందేహంగా ప్రభాస్ సినిమా ‘సాహో’. ఆగష్టు 15 న రిలీజ్ కు సిద్ధం అవుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం ‘సాహో’ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. యూరోప్ లో తాజా షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ మన డార్లింగ్ ప్రభాస్ కు జోడీగా నటిస్తోందనే విషయం తెలిసిందే. ఈ జెనరేషన్ భామల్లాగే శ్రద్ధా కూడా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్. ఏదైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటే వాటిని తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకోవడంలో క్షణం కూడా ఆలస్యం చేయదు. ఈరోజు అలానే యూరోప్ షెడ్యూల్ నుంచి షూటింగ్ లొకేషన్ నుంచి ఒక ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు శ్రద్ధ ఇచ్చిన క్యాప్షన్ “అప్ ఎబోవ్ ది వరల్డ్ సో హై #సాహో #ఐరోపా షెడ్యూల్.. పిక్ కర్టెసీ-శ్రద్ధా నాయక్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది .

ఈ ఫోటోలో శ్రద్ధ ఒక డ్రెస్సింగ్ టేబుల్ లాంటి మేకప్ టేబుల్ దగ్గర కూర్చుంది. విడివిడిగా మూడు అద్దాలు ఉండే మిర్రర్ కావడం ఒక శ్రద్ధా కాస్తా డబల్ రోల్ లో కనిపిస్తోంది. అసలు శ్రద్ధా ఏమాత్రం కనిపించకుండా ఆమె హెయిర్ మాత్రమే కనిపిస్తోంది. ఇక ఆ మిర్రర్ లో శ్రద్ధ తన బుగ్గల కింద చేతులు పెట్టుకొని ఇచ్చిన పోజు మహా క్యూట్ గా ఉంది. ఇదంతా ఒక ఎత్తైతే విండోస్ నుండి కనిపిస్తున్న మంచు పర్వతాలు మరో ఎత్తు. ఒక్క మాటలో చెప్పాలంటే.. సూపర్బ్ పిక్ అంతే! అందుకే ఈ ఫోటోను పోస్ట్ చేసిన ఆరు గంటల్లోనే దాదాపు ఏడు లక్షల లైక్స్ వచ్చాయి.
Please Read Disclaimer