ప్రభాస్ ఫ్యాన్స్ మ్యాడ్ నెస్ ఇలా ఉంది

0

ఇటు ప్రేక్షకులు.. అటు ప్రభాస్ అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్న ‘సాహో’ టీజర్ నిన్న గురువారం విడుదలైంది. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో టీజర్ కు స్పందన భారీగా ఉంది. టీజర్ విజువల్స్.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతర్జాతీయ స్థాయిలో ఉండడంతో అందరూ సుజిత్ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక ప్రభాస్ అభిమానుల సంతోషం మామూలుగా లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా ఎలా ఉందో తెలుపుతూ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక వీడియో పోస్ట్ చేసింది.

ఈ వీడియోకు “ప్రభాస్ ఫ్యాన్స్ మ్యాడ్ నెస్ ఇలా ఉంది. ప్రభాస్.. సుజిత్ & టీమ్ తో పని చేయడం ఒక కలలా ఉంది. సాహో టీమ్ అంతా రెండేళ్లకుపైగా శ్రమించారు. ఈ రెస్పాన్స్ తో ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.. థ్యాంక్ యూ.. థ్యాంక్ యూ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. వీడియోలో ఒక సినిమా థియేటర్లో ‘సాహో’ టీజర్ ను ప్రదర్శిస్తుంటే ప్రభాస్ అభిమానులు అసలు టీజర్ సౌండ్ వినిపించకుండా అరుపులు.. కేకలు.. డప్పులు.. డాన్సులతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ వీడియోకే 2.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటే ఇక టీజర్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోను బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్.. సీనియర్ హీరోయిన్ దియా మిర్జా కూడా లైక్ చేశారు.

సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘సాహో’ ఆగష్టు 15 న రిలీజ్ కానుంది. జాకీ ష్రాఫ్.. నీల్ నితిన్ ముకేష్.. మురళి శర్మ.. వెన్నెల కిషోర్.. మహేష్ మంజ్రేకర్.. అరుణ్ విజయ్ .. ఎవెలిన్ శర్మ.. మందిరా బేడి.. టిన్ను ఆనంద్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Please Read Disclaimer