`సాహో` బ్యూటీ ఇంతలోనే బ్రేకప్?

0

గత కొంతకాలంగా సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ పెళ్లి వార్తలు అంతర్జాలంలో జోరుగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. శ్రద్ధా కపూర్ తన బోయ్ఫ్రెండ్ రోహన్ శ్రేష్ఠ ను పెళ్లాడబోతోందన్నది ఆ వార్తల సారాంశం. బాలీవుడ్ లో దీపిక పదుకొనే- సోనమ్- ప్రియాంక చోప్రాల పెళ్లి తర్వాత మళ్లీ భారీ ఈవెంట్ ఇదే కాబోతోందని ప్రచారమవుతోంది. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత? అంటే ప్రఖ్యాత బాలీవుడ్ మీడియా కథనం సారాంశం వేరొకలా ఉంది. శ్రద్ధ పెళ్లాడేందుకు ఛాన్సే లేదని సదరు కథనం వెల్లడించింది.

శ్రద్ద కపూర్ ఇప్పట్లో పెళ్లాడేందుకు సిద్ధంగా లేదు. అందుకు ఇంకా చాలా సమయమే పడుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడి బోయ్ ఫ్రెండ్ కం ఫోటోగ్రాఫర్ కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు. అలాగే శ్రద్ధా కపూర్ వరుసగా సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో పెళ్లి పేరుతో టైమ్ వేస్ట్ చేసుకునే ఆలోచనే లేదట. అంతేకాదు.. తీరిగ్గా సాయంత్రాలు సినిమాలు షికార్లు పబ్బు క్లబ్బు .. లేట్ నైట్ డిన్నర్లు అంటూ కలిసే సమయమే చిక్కడం లేదట. దీంతో ఆ ఇద్దరూ తమ లవ్ కి బ్రేకప్ చెప్పేశారని సదరు కథనం వెల్లడించింది.

శ్రద్ధా కపూర్ ప్రస్తుతం సాహో చిత్రంతో పాటు ఏబీసీడీ 3 చిత్రంలో నటిస్తోంది. ఇటీవల విదేశాల్లో ఏబీసీడీ చిత్రీకరణ సమయంలో శ్రద్ధా బర్త్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఇక ఆగస్టు 15న రిలీజ్ కానున్న సాహో ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ శ్రద్ధా పూర్తి బిజీ కానుందట. మరోవైపు ఇతర ప్రాజెక్టులు కమర్షియల్ ప్రకటనలతోనూ ఫుల్ బిజీ. దీనివల్ల శ్రద్ధా ఇప్పట్లో పెళ్లాడడం కుదరదని తెలుస్తోంది. తన బోయ్ ఫ్రెండ్ రోహన్ శ్రేష్ఠకు బ్రేకప్ చెప్పేసిందని ప్రచారమవుతోంది. అయితే అంతలోనే పెళ్లి అంటూ ప్రచారం చేసిన మీడియా ఇంతలోనే అందులో నిజం లేదని కొత్త వాదన తెరపైకి తేవడం ఆసక్తికరం. కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
Please Read Disclaimer