ఒళ్లంతా ఒకటే నొప్పులు బాబూ

0

ఒకేసారి మూడు నాలుగు సినిమాల్లో నటించాల్సి రావడం అంటే ఆషామాషీనా? ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడికి పరిగెత్తాలి. నిరంతరం ప్రయాణాలతో అలసట ఎలా ఉంటుందో ఊహించవచ్చు. పైగా ఇదేమీ ఏసీ-ఆఫీస్ లో కూచుని చేసే ఉద్యోగం కాదు. ఆన్ లొకేషన్ రకరకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుని ఫిజికల్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది. 2018-19 సీజన్ చూస్తే ఏడాదికి యావరేజ్ గా మూడు నాలుగు సినిమాలు పైగా చేస్తూ అత్యంత బిజీగా ఉన్న స్టార్ గా శ్రద్ధా కపూర్ పేరు మార్మోగిపోతోంది. బాలీవుడ్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పాపులరైంది.

ఏడాదిలో మూడు సినిమాలతో సెట్స్ కి అటూ ఇటూ పరిగెత్తడం శ్రద్ధాకి అలవాటు అయిపోయింది. 2019లోనూ మూడు సినిమాలకు కమిటైందిట ఈ భామ. పైగా సాహో లాంటి భారీ చిత్రానికి కమిటవ్వడంతో దేశ-విదేశాల్లో షూటింగుల కోసం చాలానే శ్రమించాల్సొచ్చింది. అందుకే శ్రద్ధా నిన్న సాహో ఈవెంట్ లో మాట్లాడుతూ.. విశ్రాంతి అన్నదే లేదు.. ఇప్పుడు సాహో ప్రమోషన్స్ స్టార్టయిపోయాయ్.. ప్చ్! అంటూ నిట్టూర్చేసింది.

కెరీర్ టెన్షన్స్ గురించి శ్రద్ధా మాట్లాడుతూ-“ప్రస్తుతం శారీరకంగా శ్రమ ఎక్కువగా ఉంది. ఈ ఏడాది మూడు సినిమాలు ఒకేసారి చేస్తున్నా. సాహో.. చిచ్చోర్.. స్ట్రీట్ డ్యాన్స్.. ఈ మూడింటి కోసం ఒకటే పరుగులు పెడుతున్నా. ఇది చాలా కష్టంగానూ ఉంది. ప్రస్తుతం నా ఒళ్లంతా చాలా నొప్పిగా ఉంది. ఇది `ఫిజికల్ ఇంటెన్స్ ఇయర్` నాకు. విశ్రాంతి అన్నదే లేదు. మూడు సినిమాల్లో స్ట్రీట్ డ్యాన్సర్ వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది. ఇప్పుడు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నా. కానీ ఇంతలోనే సాహో ప్రమోషన్స్ మొదలైపోయాయి“ అని తెలిపింది. ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నానని.. కెరీర్ లో తొలి బహుభాషా చిత్రమిదని.. ఇలాంటి భారీ చిత్రంలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉందని శ్రద్ధ తెలిపారు.
Please Read Disclaimer