సాహో బ్యూటీ డ్యాన్స్ ఫ్లోర్ షేకింగ్

0

హాలీవుడ్ లో స్టెపప్ సిరీస్ సంచలనాల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈ సిరీస్ లో ప్రతి సినిమా ఎంతో యూనిక్ స్టైల్ తో అలరించాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మనసు దోచిన ఫ్రాంఛైజీ ఇది. డ్యాన్స్ బేస్డ్ లో ఇలాంటి సిరీస్ లు తెరకెక్కించేందుకు బాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ టర్న్ డ్ డైరెక్టర్ రెమో డి.సౌజా ప్రయత్నించడం ఆసక్తికరం. ఏబీసీడీ.. ఏబీసీడీ 2 పేరుతో ఇప్పటి కే రెండు బ్లాక్ బస్టర్ సినిమాల్ని తెరకెక్కించిన రెమో ప్రస్తుతం `స్ట్రీట్ డ్యాన్సర్ 3డి` పేరుతో భారీ చిత్రం చేస్తున్నారు.

వరుణ్ ధావన్ – శ్రద్ధా కపూర్- నోరా ఫతేహి లాంటి బెస్ట్ డ్యాన్సర్స్ కం స్టార్లను ఎంపిక చేసుకుని రెమో భారీ ప్రయోగమే చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో ఆర్టిస్టుల లుక్ లను రివీల్ చేస్తూ పోస్టర్లను రిలీజ్ చేశారు. వాటికి అద్భుత స్పందన వచ్చింది. ఇటీవలే వరుణ్ ధావన్ కొత్త పోస్టర్ ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ధావన్ బోయ్ జూనియర్ సల్మాన్ ని తలపించే లుక్ తో వేడెక్కించాడు.

తాజాగా శ్రద్ధా కపూర్ కొత్త పోస్టర్ ని రివీల్ చేశారు. శ్రద్ధ లుక్ సంథింగ్ హాట్ అండ్ సెక్సీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా కోసం శ్రద్ధా పూర్తిగా మేకోవర్ ట్రై చేసింది. కాస్త వెస్ట్రన్ స్టైల్ ని అనుకరిస్తోంది. సాహో చిత్రంలో అల్ట్రా మోడ్రన్ లుక్ తో కవ్వించిన శ్రద్ధా స్ట్రీట్ డ్యాన్సర్ 3డిలో ఇంకా సెక్సీగా కనిపిస్తోంది అంటూ బోయ్స్ కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా ఆ గ్రీన్ కలర్ టాప్.. కాంబినేషన్ గా బ్లాక్ షార్ట్.. దానిపై నెట్ స్లట్ డ్రెస్ లో అదరగొట్టింది. ఇక ఆ జడకు ఛమ్కీల రిబ్బన్లు ధరించి కుర్రకారు గుండెల్ని లాగేసిందంటే అతిశయోక్తి కాదు. విరబోసిన కురులకు పచ్చ పింక్ రిబ్బన్లతో ఆ మేకప్ సంథింగ్ హాట్ అనే చెప్పాలి. మొత్తానికి స్ట్రీట్ డ్యాన్సర్ గా శ్రద్ధ మైండ్ బ్లోయింగ్ డ్యాన్సుల ట్రీట్ కి కొదవేమీ ఉండదనడంలో సందేహం లేదు.
Please Read Disclaimer