జెర్సీ బ్యూటీ చెప్పిన మీటూ లాజిక్

0

గత ఏడాది పాల పొంగులా ఉవ్వెత్తున ఎగిసి అన్ని బాషా పరిశ్రమల్లో సంచలనం రేపిన మీ టూ ఉద్యమం అంతే వేగంగా బుస్సున చల్లారిపోయింది – హింది యాక్టర్ నానా పటేకర్ తో మొదలుకుని యాక్షన్ కింగ్ అర్జున్ దాకా ఎవరెవరి పేర్లో వచ్చాయి కాని అవేవి ఋజువు కాలేక సినిమా జనం కూడా వాటిని మర్చిపోయారు. అలా అని క్యాస్టింగ్ కౌచ్ లేదని కాదు.

చాప కింద నీరులా బ్రహ్మాండంగా సాగుతూనే ఉంది. లోలోపల వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. పరిశ్రమ తరఫున ఏవో సంఘాలు పెట్టి ఏవో మార్పులు తీసుకోస్తారని చెప్పారు కాని ఒక్కటీ సత్ఫలితాన్ని ఇవ్వలేదు. ఇదిలా ఉండగా దీని గురించి జెర్సీ భామ శ్రద్ధ శ్రీనాథ్ తనదైన శైలిలో సమాధానం చెబుతూ దీనికి పరిష్కారం అంత ఈజీ కాదంటోంది

ఒక సినిమా వల్ల మార్పు విప్లవాలు రావని దానికి టైం పడుతుందని అలాగే మీటూని ఒక రోజుకో నెలకో పరిమితం చేస్తే దాని వల్ల ఫలితాలు ఉండవని తేల్చి చెప్పేసింది. మగాళ్ళు అంత తక్కువ టైంలో మారాలని కోరుకోవడం కూడా పొరపాటని వాళ్ళను ఎడ్యుకేట్ చేయాలంటే చాలా సమయం పడుతుందని చెప్పింది.

మహిళల మీద లైంగిక వేధింపులు-వాళ్ళ భద్రత-సామాజిక రక్షణ లాంటి వాటిపట్ల రోజూ అవగాహన కలిగించే కార్యక్రమాలు చేయాలని అప్పుడే కొంతైనా మార్పు ఆశించవచ్చని చెబుతున్న శ్రద్ధా శ్రీనాథ్ కు జెర్సి హిట్ అయినా ఆఫర్స్ వెల్లువెత్తడం లేదు. అజిత్ తో చేసిన పింక్ రీమేక్ నీర్కొండ పార్వై వచ్చే నెల 8న విడుదల కానుంది. విక్రం వేదా తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చే పాత్ర ఇదని దీని మీద శ్రద్ధా శ్రీనాథ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది
Please Read Disclaimer