‘దేవదాస్’ను మిస్ అయ్యి ‘జెర్సీ’ని దక్కించుకుంది

0

కన్నడంలో సూపర్ హిట్ ను దక్కించుకున్న యూటర్న్ చిత్రంను తెలుగులో తాజాగా రీమేక్ చేసిన విషయం తెల్సిందే. తెలుగు సమంత లీడ్ రోల్ లో కనిపించగా కన్నడంలో శ్రద్దా శ్రీనాథ్ నటించింది. అక్కడ యూటర్న్ అద్బుతమైన విజయాన్ని దక్కించుకోవడంతో పాటు కన్నడ సినీ పరిశ్రమకు అందించే పలు ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకుంది. శ్రద్దా శ్రీనాథ్ కూడా పలు అవార్డులను రివార్డులను దక్కించుకుంది. అందుకే ఈమెను తెలుగులో పరిచయం చేయాలని భావించారు. ఆమద్య దేవదాస్ చిత్రంలో నాగార్జునకు జోడీగా ఈమెను ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

దర్శకుడు శ్రీరామ్ ఆధిత్య స్వయంగా ఆమెకు కథను చెప్పడం కూడా జరిగిందని ఆమె ఒప్పుకుందని సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. కాని చివరి నిమిషంలో ఏమైందో కాని శ్రద్దా శ్రీనాథ్ స్థానంలో ఆకాంక్ష సింగ్ ను తీసుకున్నారు. తెలుగులో వచ్చిన ఆఫర్ చివరి నిమిషయంలో శ్రద్దా శ్రీనాథ్ కోల్పోయింది. అయినా కూడా తాజాగా మరో అవకాశం ఈమె తలుపు తట్టింది.

ప్రస్తుతం నాని హీరోగా గౌతమ్ దర్శకత్వంలో జెర్సీ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రద్దా శ్రీనాథ్ ను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతుంది. నానికి జోడీగా ఈమె సరిగ్గా సూట్ అయ్యే అవకాశం ఉందని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. కన్నడంతో పాటు తమిళంలో కూడా ప్రస్తుతం పలు చిత్రాలను చేస్తున్న ఈ అమ్మడు తెలుగులో కూడా జెర్సీ తో ఎంట్రీ ఇవ్వబోతుందన్నమాట. త్వరలోనే జెర్సీలో శ్రద్దా శ్రీనాథ్ అంటూ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.