తెలుగు అసురన్ లో ఛాన్స్ కొట్టేసిందట!

0

దాదాపుగా రెండు దశాబ్దాల నుండి తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న శ్రియ ఈమద్య కాస్త జోరు తగ్గించిందని చెప్పాలి. సీనియర్ అవ్వడంతో ఈమెకు కాస్త సినిమా ఛాన్స్ లు తగ్గాయి. వయసుకు తగ్గ పాత్రలు చేసేందుకు సిద్దంగా ఉన్న శ్రియ కు మరో మంచి ఆఫర్ దక్కింది. తెలుగులో ఈమె ఇప్పటి కే వెంకటేష్ కు జోడీగా సుభాష్ చంద్రబోస్ మరియు గోపాల గోపాల చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మరోసారి వెంకీకి జోడీగా నటించే అవకాశం ను దక్కించుకుంది.

తమిళంలో సెన్షేషనల్ సక్సెస్ అయిన అసురన్ చిత్రంను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. తెలుగులో ఈ చిత్రానికి సంబంధించిన రీమేక్ ఏర్పాట్లు మొదలయ్యాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు వహించబోతున్నారనే విషయమై చర్చ జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం శ్రియను నిర్మాత సురేష్ బాబు సంప్రదించినట్లుగా సమాచారం అందుతోంది. మంచి ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్న శ్రియ వెంటనే ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

వెంకటేష్ మరియు శ్రియలు కలిసి నటించిన రెండు సినిమాల్లో సుభాష్ చంద్రబోస్ ఫ్లాప్ అవ్వగా గోపాల గోపాల సినిమా యావరేజ్ గా నిలిచింది. అయితే వీరిద్దరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. అందుకే మరోసారి వీరి కాంబో అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తుతోంది. ఇప్పటి కే ఈ సినిమా కోసం ఒక దర్శకుడి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

దర్శకుడి పేరు అఫిషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాత హీరోయిన్ విషయమై కూడా ప్రకటించే అవకాశం ఉంది. త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. వెంకీ మామ సినిమా ఫైనల్ షూట్ లో పాల్గొంటున్న వెంకటేష్ అది పూర్తి చేసి అసురన్ రీమేక్ లో నటించబోతున్నాడు.
Please Read Disclaimer