మెగా డాటర్ తో మెగాస్టార్ హీరోయిన్

0మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్ మూవీలో నటించిన భామ శ్రియా శరణ్. ప్రస్తుతం ఈ సీనియర్ బ్యూటీ కెరీర్ కాసింత డల్ అయిన మాట వాస్తవమే కానీ.. మధ్యమధ్యలో మంచి ప్రాజెక్టులలో అవకాశం దక్కించుకుంటోంది. ఇప్పుడీ భామ మెగా డాటర్ నీహారికతో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది.

తాజాగా శ్రియ-నీహారిక కాంబినేషన్ లో రూపొందే సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. కంచె.. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. గౌతమిపుత్ర శాతకర్ణి వంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన జ్ఞానశేఖర్ ఈ మూవీ నిర్మాతగా మారుతుండగా.. సుజన దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇద్దరు అమ్మాయిలు లీడ్ రోల్స్ అన్నంత మాత్రాన ఇదేమీ ఆర్ట్ ఫిలిం టైపులో ఉండదట. కంప్లీట్ గా కమర్షియల్ ఫార్ములాలోనే సాగుతుందని చెబుతున్నారు. పైగా మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించనుండడం ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది.

మూవీ ఆరంభ కార్యక్రమానికి నీహారిక సోదరుడు వరుణ్ తేజ్.. కంచె దర్శకుడు క్రిష్ చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. వరుణ్ తేజ్ క్లాప్ ఇవ్వగా.. క్రిష్ గౌరవ దర్శకత్వం వహించాడు. గొట్టిముక్కుల పద్మారావు కెమేరా స్విచాన్ చేయగా.. జ్ఞాన శేఖర్ తో పాటు రమేష్ కరుటూరి కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారు.