ఫ్లయింగ్ కిసెస్ ఇస్తోంది!

0

సీనియర్ హీరోయిన్ శ్రియ స్పెషాలిటి ఏంటంటే.. 18 ఏళ్ళ క్రితం సినిమాల్లోకి సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. మరి ఇంతకాలం అదే గ్లామర్ మెయింటెయిన్ చేయడం మాటలు కాదు కదా? పోయినేడాది తన రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కోస్చీవ్ ను పెళ్ళి చేసుకొని సెటిల్ అయింది. అప్పటి నుంచి సినిమాల్లో కాస్త జోరు తగ్గింది. అయినా ఇప్పటికీ చేతిలో కొన్ని ఆఫర్లు ఉన్నాయి. ఈ భామ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

రీసెంట్ గా తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. లాక్మే ఫ్యాషన్ వీక్ లో తనలో ఉన్న ఫ్యాషన్ దివాను బైటకు తీసిమరీ చూపరులను కట్టి పడేసింది. క్యాప్షన్ లో తనకు ఇరవై సంవత్సరాలుగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్న పాయల్ సింఘాల్ కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో బ్లూ కలర్ టోర్న్ జీన్స్.. బ్లాక్ టాప్ ధరించింది.. పైనేమో పూల డిజైన్ ఉన్న పింక్ కలర్ షర్టు ను బటన్స్ లేకుండా ధరించింది. సెక్సీ పోజులకు ఏమాత్రం లోటు రానివ్వకుండా.. గ్లామర్ డిస్కౌంట్లు ఇవ్వకుండా నెటిజన్లను మెస్మరైజ్ చేసింది. ఒక ఫోటోలో ఫ్లయింగ్ కిసెస్ కూడా ఇచ్చింది. అసలే అందాలభామ.. ఇలాంటి ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తే నెటిజన్లు ఏం కావాలి?

అందుకే రెచ్చిపోయి మరీ లైక్స్ కొట్టారు.. కామెంట్స్ పెట్టారు. “వైన్ ఎప్పటికీ ఓల్డ్ కాదు”.. “రిటర్న్ అఫ్ ది క్వీన్”.. “పర్ఫెక్ట్ సంతూర్ మోడల్”.. “ఎవర్ గ్రీన్ బ్యూటీ” అంటూ పొగడ్తలు కురిపించారు. ఇక శ్రియ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే హిందీలో ‘తడ్కా’ లో నటిస్తోంది.. తమిళంలో ‘నరకాసురన్’.. ‘సండకారి’ అనే టైటిల్స్ తో తెరకెక్కే రెండు సినిమాలలో నటిస్తోంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home