శ్రీయ.. పాత అందాల్ని కొత్తగా మత్తుగా..

0

అందాల కథానాయిక శ్రీయ ఎక్కడ ఉన్నా అక్కడ ఏదో గమ్మత్తయిన ఫ్లేవర్ ఉంటుంది. అందుకే శ్రీయను సైమా వాళ్లు ప్రత్యేకించి బ్రాండ్ ప్రమోటర్ గా ఎంచుకున్నారని భావించాల్సి ఉంటుంది. ప్రతియేటా గల్ఫ్ దేశాల్లో జరిగే సైమా అవార్డుల వేడుకలో శ్రీయ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈవెంట్ ప్రారంభానికి ముందే సైమాకు విస్త్రతంగా ప్రచారం చేయడంలోనూ శ్రీయ ఎంతో సహకారిగా ఉంటోంది.

ఇకపోతే 2019 సైమా అవార్డ్స్ వేడుకలు ఖతార్-దోహాలో రెండ్రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో శ్రీయ స్పెషల్ అప్పియరెన్స్ గురించి తెలిసిందే. అయితే ఈవెంట్ లో శ్రీయ డ్యాన్సులకు సంబంధించిన ఫోటోలు.. ఈవెంట్లో వేదిక వద్ద ఉన్నప్పటి ఫోటోలు ఇవిగో అంటూ కొన్ని ఫోటోల్ని అంతర్జాలంలో వైరల్ చేస్తున్నారు. అయితే వీటిలో 2018 సైమా ఈవెంట్ ఫోటోలు కొన్ని దర్శనమిస్తున్నాయి.

అప్పటితో పోలిస్తే శ్రీయ ఇప్పుడు ఇంకా స్లిమ్ గా మారింది. లుక్ పరంగా గుర్తు పట్టలేనంత మారిపోయింది. 2018 ఈవెంట్ లో కాస్తంత బొద్దందాలతో గమ్మత్తయిన రూపంతో సమ్మోహనానికి గురి చేసిన శ్రీయ ఈసారి మాత్రం స్లిమ్ లుక్ తో కనిపించారు. విదేశీ క్రీడాకారుడు ఆండ్రూ కోశ్చీవ్ ని పెళ్లాడిన శ్రీయ ఏడాది కాలంగా విదేశీ టూర్లతో ఫుల్ జోయ్ ఫుల్ గా టైమ్ ని స్పెండ్ చేస్తోంది. అవార్డు కార్యక్రమాలకు విచ్చేసినప్పుడు ఇంకా స్పెషల్ గా ప్రిపేర్డ్ గా కనిపించడం తనకే చెల్లింది. ఇకపోతే శ్రీయ ఈ ఏడాది కొత్త సినిమాలకు సంతకాలు చేసేదెపుడో తెలియాల్సి ఉంది. సైమా 2019 ఉత్సవాల్లో శ్రీయ బ్యాక్ లెస్ ఫోజు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. బ్లాక్ డిజైనర్ డ్రెస్ లో శ్రీయ సంపేసిందంతే.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home