ఇది ఎన్నో హనీమూన్ శ్రియా?

0

సీనియర్ హీరోయిన్ శ్రియ గురించి ఎవరికీ ఇంట్రో ఇవ్వాల్సిన పనిలేదు. ప్రస్తుతం సౌత్ లో ఉన్న సీనియర్ మోస్ట్ హీరోయిన్లలో శ్రియ ఒకరు. ఇంకా హీరోయిన్ ఏంటి..ఫేడ్ అవుట్ అయింది కదా అనొచ్చు.. కానీ శ్రియ చేతిలో ఇంకా రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ఇక శ్రియ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే పోయినేడాది మార్చ్ లో రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కోస్చీవ్ ను వివాహమాడి శ్రీమతిగా మారిపోయింది. అప్పటి నుంచి శ్రియ – ఆండ్రీ జంట కాలికి బలపం కట్టుకునిమరీ అన్నీ దేశాలు తిరుగుతున్నారు.

ఛాన్స్ దొరికిందే తడవుగా ఏదో ఒక దేశంలో ప్రేమపక్షులుగా వాలిపోతారు. అక్కడ సరదాగా గడుపుతూ.. చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. మంచి ఫోటోలు కూడా తీసుకుంటారు. ఆ ఫోటోలలో కొన్నిటిని శ్రియ తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ ఫోటోలు నిన్నే పెళ్ళి చేసుకొని ఈరోజే హానీమూన్ కు వెళ్ళిన జంట ఎలా ఉత్సాహంగా ఉంటారో అలా ఉంటాయి. ఇప్పటికే మెక్సికో.. పెరూ.. కొలంబియా.. బ్రిటన్ లాంటి ఎన్నో దేశ ప్రదేశాలను చుట్టేసిన ఈ జంట తాజాగా స్పెయిన్ లో విహరిస్తున్నారు. ఆ దేశంలోని బార్సిలోనా నగరాన్ని శ్రియ-ఆండ్రీ తుఫాను తాకింది. రష్యన్ హ్యాండ్సమ్ మ్యాన్ ఆండ్రీ కొంచెం సిగ్గరిలా ఉన్నాడు అందుకే ఫోటోలలో హంగామా అంతా శ్రియదే. ఈ హంగామా చూస్తుంటే అసలు ఇది మొదటి హనీమూనా.. లేక రెండు మూడు నాలుగు ఐదు.. ఆరో హనీమూనా అని ఎవరికైనా అనుమానం రావడం ఖాయం.

ఈ ఫోటోలకు శ్రియ ఇచ్చిన క్యాప్షన్ ‘జస్ట్ లైక్ దట్’. శ్రియ అల్లరిని భరించే కరెక్ట్ భర్త దొరికాడు.. ఎన్ని హనీమూన్లకైనా తీసుకెళ్తాడు.. ఎంత అల్లరి చేసినా ఓపిగ్గా భరిస్తాడు. అయ్యలారా.. అమ్మలారా ఇందుమూలంగా యావన్మందికీ తెలియజేయునది ఏమనగా.. మీరు కూడా ఈ మల్టిపుల్ హనీమూన్ల ఫిలాసఫీని ఎంచక్కా ఫాలో అయిపోండి. దయచేసి గరిటెలు.. చేటలు మాత్రం లగేజ్ లో పెట్టుకోకండి. రొమాన్స్ కాస్తా వయొలెన్స్ గా మారే అవకాశం ఎప్పుడూ పొంచి ఉంటుంది.
Please Read Disclaimer