మనుషుల్ని కోతులుగా మారుస్తున్న శ్రియ

0

సీనియర్ హీరోయిన్ శ్రియ పోయినేడాది తన రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కొశ్చీవ్ వివాహం చేసుకొని శ్రీమతిగా మారిన సంగతి తెలిసిందే. వివాహం తర్వాత టాలీవుడ్ లో సినిమా ఆఫర్లు తగ్గాయి. అయితే తమిళంలో మాత్రం ప్రస్తుతం ‘నరకాసురన్’.. ‘సండకారి’ అనే టైటిల్స్ తో తెరకెక్కే రెండు సినిమాలలో నటిస్తోంది. హిందీలో ‘తడ్కా’ అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. సినిమాల సంగతి ఇలా ఉంటే పర్సనల్ లైఫ్ లో మాత్రం శ్రియ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంది.

తాజాగా శ్రియ డ్యాన్స్ చేస్తూ ఉండే వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. శ్రియపేరుమీదే ఉన్న ఇన్స్టా ఖాతా అయినప్పటికీ ఇది ఒరిజినల్ ఖాతా కాదు. ఈ వీడియోలో శ్రియ ఒక పింక్ బికిని ధరించి.. పైనేమో ఒక చున్నిని మోటుగా చుట్టుకున్నట్టుగా కనిపిస్తున్న ఒక టాప్ ధరించింది. ఈ డ్రెస్ కు మ్యాచింగ్ గా ఓ పెద్ద హ్యాండ్ బ్యాగ్.. కళ్ళకు గాగుల్స్ ధరించి నాటు తీన్ మార్ డ్యాన్స్.. పులి వేషం చిందులు.. కథక్ నాట్యం.. ఇలా అన్నిటిని కలిపి మిక్సీలో వేసినట్టుగా నర్తించింది. ఆ ఉన్మాదనర్తనంతో ఆమె నేపథ్యంలోని ఫోటోలో మనిషి మొహం కాస్తా మేలుజాతి కోతిలా మారిపోయింది.

ఈ చిలిపి వీడియోను శ్రియ భర్తగారే షూట్ చేసి ఉంటారని అనుకుంటున్నారు. అసలే సోషల్ మీడియాలో వింతలకు చాలా డిమాండ్ ఉంటుంది కదా. ఈ వీడియో కాస్తా వైరల్ అయిపోయింది. అసలే పిచ్చి డ్యాన్స్ కావడంతో నెటిజనులు కూడా ఈ వీడియోకు పిచ్చి కామెంట్స్ పెట్టారు. ఒకరు “శ్రియ నీకు పిచ్చి పట్టిందా?” అని అడిగారు. మరొకరు “పిచ్చి పీక్స్ అంటే ఇదేనేమో” అన్నారు. ఇంకొకరు “క్రేజీగా ఉందే” అన్నారు.