శీనయ్య కోసం సూపర్ హాట్ సీనియర్ బ్యూటీ ?

0

వివాహం ముందు వరకూ వరస సినిమాల తో హోరెత్తించిన శ్రియ మిసెస్ ఆండ్రీ కోస్చీవ్ గా మారిన తర్వాత స్పీడ్ తగ్గించింది. దాంతో పాటుగా కొత్త తరం కథానాయికల రాక తో శ్రియ డిమాండ్ కొంత తగ్గింది. అలా అని పూర్తిగా అవకాశాలు తగ్గిపోలేదు. చేతిలో ఇప్పటికీ సినిమాలు ఉన్నాయి. కొత్త ఆఫర్లు కూడా వస్తూనే ఉన్నాయి. తాజాగా వివి వినాయక్ డెబ్యూ సినిమా ‘శీనయ్య’ లో శ్రియను హీరోయిన్ గా తీసుకోవాలని ప్లాన్ చేసినట్టు సమాచారం.

ఇప్పటికే శ్రియ ను సంప్రదించారని.. శ్రియ కూడా ఫార్మల్ గా తన పచ్చజెండా ఊపేసిందని సమాచారం. పారితోషికం విషయంలో అంగీకారం కుదిరితే వినాయక్ తో రొమాన్స్ కు రెడీ అయినట్టే. మ్యారేజ్ తర్వాత శ్రియ పెద్దగా సినిమాలు సైన్ చెయ్యలేదు. దీంతో అభిమానులు కొంత నిరాశపడిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు మాత్రం శ్రియ వద్దకు పలు ఆఫర్లు వచ్చాయని త్వరలోనే కొత్త సినిమాల ప్రకటన ఉంటుందని తెలియడంతో అభిమానులకు ఇది సంతోషకరమైన వార్తే. అయితే పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో కాకుండా వినాయక్ లాంటి లేటు వయసు డెబ్యూ హీరో సరసన హీరోయిన్ అనగానే కొందరు పెదవి విరుస్తున్నారు. శ్రియ తన కెరీర్ ఆరంభం నుంచి ఇలాంటివి పట్టించుకోలేదు. తన కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే శ్రియ తమిళ కమెడియన్ వడివేలు సినిమాలో ఆయనకు జోడీగా నటించి అందరికీ షాక్ ఇచ్చింది. అంతే కాదు. పలు చిన్న బడ్జెట్ సినిమాల్లో కూడా నటించి తనకు సినిమాల విషయంలో పెద్ద చిన్న తేడాలు లేవని నిరూపించింది. అందుకే వినాయక్ తో జోడీ కట్టడం పెద్దగా షాక్ ఇచ్చే అంశమేమీ కాదు.

ఈమధ్య శ్రియ పేరును మెగాస్టార్ చిరంజీవి నటించబోయే #చిరు152 సినిమా కు.. వెంకటేష్ నటించనున్న ‘అసురన్’ రీమేక్ లో హీరోయిన్ గా పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ ఇప్పటి వరకైతే అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఈ సినిమాల్లో కూడా ఆఫర్ వస్తే మాత్రం పెళ్ళి తర్వాత కూడా శ్రియ కెరీర్ అద్భుతంగా కొనసాగుతున్నట్టేనని అనుకోవాలి.
Please Read Disclaimer