శ్రుతి ఫ్యామిలీలో కరోనా కల్లోలమా?

0

అందాల శృతి హాసన్ ఫ్యామిలీ డ్రామా గురించి బయటి ప్రపంచానికి తెలిసింది ఇంత అయితే తెలియనిది ఎంతో! ప్రస్తుతం ఈ ఫ్యామిలీ సభ్యులంతా ఎవరికి వారే అన్నట్టుగా విడిపోయారట. నాన్న కమల్ హాసన్.. అమ్మ సారిక- చెల్లి అక్షర హాసన్.. ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారు. ఇక తాను కూడా తన దారిలో తాను ఉందట. ఇది చాలా రోజులుగా సాగుతున్న తంతు అని శ్రుతి తెలిపింది. మరి ఎందుకు ఫ్యామిలీ అంతా విడిపోయారనేది ఆరా తీస్తే… అసలు విషయం శృతినే స్వయంగా చెప్పేసింది.

ఈ ఫ్యామిలీ విపత్తునకు కారణమేంటి అంటే..? ప్రతి ఒక్కరు తమ ఇళ్ళల్లోనే ఉండాలని.. ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి నుంచి దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటిస్తూ పీఎం మోడీ నిర్ణయం తీసుకున్నారు. సరిగ్గా ఇలాంటి ఆపత్కాలంలో ఇటీవల కమల్… శృతి… వారి ఫ్యామిలీ లండన్ వెళ్లొచ్చారట. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు స్వీయ నిర్భంధం పాటించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో కమల్ ఫ్యామిలీ ఎవరికి వారు నిర్భంధం పాటిస్తున్నారట. అయితే లోకనాయకుడు కమల్ హాసన్.. తన చిన్న కూతురు అక్షర హాసన్ చెన్నైలో ఎవరికివారు వేర్వేరు ఇళ్ళల్లో ఉన్నారట. ఎవరికీ సంబంధం లేని విధంగా ఒంటరిగా ఉన్నట్టు శృతి తెలిపింది. ఇక తాను.. తల్లి సారిక ముంబయిలో వేర్వేరు క్వారంటైన్ లో ఉన్నామని వెల్లడించింది.

ఇంకా ఆమె చెబుతూ “కరోనా గురించి ప్రజలంతా భయపడుతున్నారు. ఆ భయం మాలో కూడా ఉంది. అందుకే మేమంతా స్వీయ నిర్భంధంలోకి వెళ్ళాం. క్వారంటైన్ లో ఉండటం చాలా కష్టమైన పనే. భయటకు వెళ్లే ఛాన్సే లేదు. పని మనిషి కూడా లేరు. దీంతో నేనే వంట చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలోనే మనకు నచ్చిన వంట చేసుకోవచ్చు. అయితే ఒంటరిగా ఉండటం చాలా ఇబ్బందిగానే ఉంది. కానీ మనం మనతో సమయం గడపలేకపోతే.. ఇంకెవ్వరికీ మంచి కంపెనీ ఇవ్వలేం. అందుకే నాకు నేను కంపెనీ ఇచ్చుకుంటున్నా“ అని తెలిపింది.

`మేం ఇంతగా భయపడుతుంటే.. కొంతమంది విద్యావంతులు ఇవేమీ పట్టించుకోకుండా బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఇతరులతో కలిసి తిరుగుతుండటం బాధాకరం. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి` అని సందేశం ఇచ్చింది శ్రుతి. అన్నట్టు ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తూ తెలుగులో రవితేజ సరసన `క్రాక్` చిత్రంలో నటిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం మేలో విడుదల కానుంది. దీంతో పాటు తమిళంలో `లాభం` అనే సినిమా చేస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ తో `వకీల్ సాబ్`లోనూ నటిస్తున్నట్టు టాక్.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-