పీపీఈ కిట్ లోనూ `శ్రుతి`మించేలా

0

మహమ్మారీ భయాల నుంచి ఇప్పుడిప్పుడే సెలబ్రిటీ ప్రపంచం బయటపడుతోంది. అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తూ డేరింగ్ గా విమానయానాలు చేస్తూ షూటింగులకు అటెండవుతున్నారంతా. అయితే ఈ ప్రయాణాల్లో పీపీఈ కిట్లు ధరించి పలువురు సెలబ్రిటీలు ఇచ్చిన ఫోజులు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. ఒక్కొక్కరూ ఒక్కో రకం విచిత్ర వేషంతో ఆకర్షించారు. ఇదిగో ఇక్కడ శ్రుతి హాసన్ ఫోజు చూస్తున్నారుగా.. శ్రుతిమించేలా..

అదేమైనా ప్యారిస్ హంసనడకల ర్యాంపు షోనా? మరీ ఇంతగా శ్రుతిమించాలా? అన్నట్టుగా ఉందా ఫోజు.. టాప్ టు బాటమ్ బ్లాక్ లో మహమ్మారీపైనే విక్టరీ సాధించినంత బిల్డప్పిస్తోంది. ఇలా కిట్ ధరించి ప్రయాణానికి సిద్ధంగా ఉంది. ఎంతో చమత్కారమైన ఎక్స్ ప్రెషన్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది శ్రుతి.

సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్గా ఉండే సెలబ్రిటీలలో శ్రుతి హాసన్ కి గొప్ప పాపులారిటీ ఉంది. తన రోజువారీ జీవితంలో ఏ సందర్భాన్ని అయినా.. అభిమానుల కోసం ఎప్పటికప్పుడు ఇలా ఫోటోలు వీడియోల రూపంలో పోస్ట్ చేస్తుంది. తన ఫాలోవర్స్ ని ఆకర్షించేందుకే ఇలా ఫోజులిస్తుంటుంది.

అంతర్జాతీయ స్థాయిలో జాజ్ బాండ్ టూర్ తో ప్రశంసలు పొందిన శ్రుతి గాయనిగానూ రాణించే ప్రయత్నం చేసింది. కానీ అక్కడ ఆశించినంతగా ఏదీ కుదరలేదు. ప్రస్తుతం కథానాయికగా కంబ్యాక్ అయ్యేందుకు వరుసగా సినిమాలకు సంతకాలు చేస్తోంది.

కెరీర్ సంగతి చూస్తే.. శ్రుతి హాసన్ ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో నటిస్తోంది. మాస్ రాజా రవితేజ సరసన క్రాక్ లో నటిస్తోంది. ఈ యాక్షన్ డ్రామాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. వరలక్ష్మి శరత్కుమార్ .. సముదిరకని ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటింస్తున్నారు. క్రాక్ వచ్చే ఏడాది విడుదల కానుంది. తమిళంలో లాభమ్ అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఇందులో విజయ్ సేతుపతి హీరో. ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే పవన్ కల్యాణ్ సరసన ఓ సినిమాకి కమిటైందన్న ప్రచారం సాగుతోంది.