ఇది గానమా.. పద్యమా ఏంటిది శ్రుతి?

0

అందాల శ్రుతిహాసన్ మల్టీట్యాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన శ్రుతి అప్పుడప్పుడు తనలోని గాయనిని కూడా వెలికి తీస్తూ చాలానే మ్యాజిక్ చేస్తోంది. ముఖ్యంగా పాప్ స్టార్ అవ్వాలనుకుని నటి అవ్వడం శ్రుతి యాక్టింగ్ కెరీర్ కి కొంత మైనస్ అయ్యింది. ఓవైపు నటనలో కొనసాగలేక మరోవైపు గాయనిగా మార్క్ వేయలేక రెండు పడవల పయనం చాలానే ఇబ్బంది పెడుతోందని ఫ్యాన్స్ కి అర్థమవుతోంది.

బోయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేకి బ్రేకప్ చెప్పేసిన శ్రుతి ప్రస్తుతం సినీకెరీర్ పైనా దృష్టి సారించింది. ఓవైపు నటనలో కొనసాగుతూ నెమ్మదిగా పాప్ ప్రపంచాన్ని ఆకర్షించేందుకు మ్యూజిక్ బ్యాండ్లలో పెర్ఫామెన్స్ ఇస్తూ తనవంతు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే అమెరికా సహా విదేశాల్లో సింగర్ గా పెర్ఫామెన్సెస్ ఇచ్చి ఆకట్టుకుంది.

లేటెస్టుగా లండన్ లో లైవ్ మ్యూజిక్ పెర్ఫామెన్స్ తో ఫ్యాన్స్ కి టచ్ లో కి వచ్చింది. శ్రుతి తనదైన శైలి గానాలాపనతో ఓలలాడిస్తున్న ఈ వీడియోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. “సూపర్ ట్యాలెంటెడ్ లేడీస్ తో కలిసి ఈ ఫన్నీ నైట్ పెర్ఫామెన్స్ ఇస్తున్నా. జోసియా మ్యూజిక్.. టీనా కీబోర్డ్స్ … బీస్ట్ సౌండ్.. లండన్!“ అంటూ వివరాలందించింది. తూర్పు లండన్ లోనే లవ్ లీయెస్ట్ పీపుల్!! థాంక్యూ అంటూ జోయ్ ని చూపించింది శ్రుతి. ఆషా అండ్ టిమోకర్ బృందం తనకు లండన్ లో చాలా కాలంగా సపోర్ట్ గా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపింది.

అన్నట్టు శ్రుతి అలా పూనకం వచ్చినట్టు ఊగిపోతూ చేస్తున్న ఆ గానాలాపన చాలా ఠఫ్ గానే ఉంది. అది గానమా.. పద్యమా? అన్నంతగా శ్రుతి లీనమై ఊగిపోతూ పాడేస్తున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా శ్రుతిలోని ఎనర్జీకి పట్టుదలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. తాను అనుకున్నది సాధించుకునేందుకు పట్టువదలని గజినీలా ప్రయత్నిస్తోంది మరి.
Please Read Disclaimer