హాలీవుడ్ ‘వెబ్ సిరీస్’లో ఛాన్స్ కొట్టేసిన స్టార్ హీరోయిన్!

0

హీరోయిన్ శృతిహాసన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగుతో పాటు తమిళ.. హిందీ భాషలలో వరుసగా స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ హీరోయిన్ గా ఎదిగింది శృతి. ఇక అమ్మడు కాటమరాయుడు సినిమా తర్వాత తెలుగులో మళ్ళీ కనిపించలేదు. ఆ మధ్య రెండేళ్లు ప్రేమ కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇటీవలే లవ్ బ్రేకప్ కావడంతో మళ్లీ సినిమాల పై దృష్టి పెట్టింది ఈ ముద్దుగుమ్మ. నిజానికి సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శృతి. చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుతం.. తమిళం హిందీలో ఒక్కో సినిమాలు చేస్తుంది. అలాగే తెలుగులో రవితేజ – గోపీచంద్ మలినేని సినిమాలో హీరోయిన్గా శృతి నటిస్తుంది.అయితే తాజా సమాచారం ప్రకారం.. శృతి హాసన్ అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ “టెడ్స్టోన్”లో నటించే అవకాశం దక్కింది. అంతర్జాతీయ వెబ్ సిరీస్గా రూపొందనున్న “ట్రెడ్ స్టోన్”ని రామిన్ బహ్రానీ తెరకెక్కించనున్నారు. ఢిల్లీలో ఒక హోటల్లో వెయిట్రెస్గా పని చేస్తూ రహస్యంగా హత్యలు చేసే యువతిగా శృతి నటించనుందని సమాచారం.

హంగేరీలోని బుడాపెస్ట్ ప్రాంతంలో జరగనున్న షెడ్యూల్లో శృతిహాసన్ త్వరలో పాల్గొననుందట. నీరా పటేల్ అనే వెబ్ సిరీస్ ప్రధాన పాత్రలో శృతి కనిపించనుంది. ఈ సందర్భంగా అంతర్జాతీయ వెబ్ సిరీస్లో నటిస్తున్న తొలి సౌత్ భామ శృతిహాసన్ కావడం విశేషం. ఈ వెబ్ సిరీస్ తో శృతికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు లభిస్తుందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ కనుక సక్సెస్ అయితే శృతి హాలీవుడ్ లో అడుగుపెట్టడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. చూడాలి మరి అమ్మడి అదృష్టం ఎలా ఉందో..!
Please Read Disclaimer