సూపర్ స్టైలిష్ శృతి ఈజ్ బ్యాక్!

0

మిగతా హీరోయిన్లు వేరు శృతి హాసన్ వేరు అనేది ఎప్పుడూ ఋజువు చేస్తూనే ఉంటుంది. ఐరన్ లెగ్ ముద్ర వేయించుకున్న జనాలతోనే స్టార్ హీరోయిన్ అని పిలిపించుకోవడం.. కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో కెరీర్ ను పక్కన పెట్టి మైఖేల్ కోర్సలేతో లవ్వంటూ లండన్ నగరాన్ని పిచ్చెక్కించడం.. ఇక పెళ్ళి తరువాయి అనే సమయంలో ‘బ్రేకప్’ అంటూ షాక్ ఇవ్వడం.. బ్రిట్నీ స్పియర్స్ .. షకీరాల తరహాలో ఇంటర్నేషనల్ సింగర్ అవుతానంటూ ఆంగ్లంలో పాటలందుకోవడం.. ఇప్పుడేమో మళ్ళీ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తుండడం.. ఇలా చెప్పుకుంటూ పోతే శృతి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అందుకే మిగతా హీరోయిన్లు వేరు శృతి వేరు.

అయితే ఒక విషయంలో మాత్రం శృతి మిగతా హీరోయిన్ల లాగానే ఉంటుంది. అదేంటంటే.. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండడం. తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా రెండు ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు శృతి “లండన్ నైట్స్ @మ్యాడాక్స్ గ్యాలరీ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఫోటోల్లో ఆ స్టైల్ మామూలుగా లేదు. ఒక పాప్ సింగర్ తరహాలో డీప్ వీనెక్ ఉన్న బ్లాక్ గౌన్… ఆ పైన బ్లాక్ జాకెట్ ధరించింది. మెడలో పెద్ద పెద్ద కాయిన్స్ తరహాలో పూసలు ఉండే చెయిన్ వేసుకుంది. ఇక పర్పుల్ కలర్ లిప్ స్టిక్ తో ‘నేను యమా బోల్డ్’ అన్నట్టుగా ఒక స్టైలిష్ లుక్ ఇచ్చింది. ఓవరాల్ గా లుక్ అదిరిపోయింది. ఇలా హాలీవుడ్ హీరోయిన్ల తరహాలో కనిపించి మెప్పించడం సాధారణ విషయం కాదు.. పర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి. కరెక్ట్ గా ఆ డ్రెస్ కు తగ్గట్టుగా స్టైల్ ను రంగరించింది.

ఈ ఫోటోలకు కామెంట్లు అదిరిపోయాయి. “సూపర్ స్టైలిష్ లేడీ”.. “శృతి ఈజ్ బ్యాక్”.. “లండన్ లో ఏం చేస్తున్నావు” అంటూ కామెంట్లు పెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే తమిళంలో విజయ్ సేతుపతితో ‘లాబం’ అనే సినిమా చేస్తోంది. ఆ ఒక్కటే కాకుండా మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయని అంటున్నారు.
Please Read Disclaimer