శ్రుతి ఫ్యాన్స్ విరహంతో వేగిపోవాలా?

0

చిలిపిగా నవ్వేస్తూ… కొంటెగా కవ్విస్తూ.. అల్లరిగా జివ్వనిపిస్తూ .. అదిరిపోయే డ్యాన్స్ మూవ్ మెంట్స్ తో జిల్ జిల్ అనిపించే శ్రుతిహాసన్ .. ఉన్నట్టుండి మిరుమిట్ల ప్రపంచానికి దూరమైపోయి ఎంతో అన్యాయం చేసింది ఫ్యాన్స్ కి. మైఖేల్ కోర్సలే కరోనాలా శ్రుతి వెంట పడకపోయి ఉంటే ఈపాటికి సీన్ ఎలా ఉండేదో!

గబ్బర్ సింగ్ భాగ్య లక్ష్మిలా.. రేసుగుర్రం స్పందనలా ఇంకా ఫ్యాన్స్ గుండెల్లోనే అలా ఉండిపోయింది. ముఖ్యంగా భాగ్యలక్ష్మి చీరకట్టు బొట్టు ఇంకా అలానే మదిలో పదిలం అయిపోయాయి. ఆ తర్వాత రేసుగుర్రంలో ఏ స్పందనా ఉండని బిర్రబిగుసుకు పోయిన స్పందనను అసలే మర్చిపోలేకపోతున్నారు. బలుపు చిత్రంలో బాగా అందాల్ని వడ్డించేసిన హాట్ శ్రుతిని పదే పదే గుర్తు చేసుకుంటున్నారు.

ఇటీవల శ్రుతి నటించిన సినిమాలేవీ రిలీజ్ కాలేదు కాబట్టి అప్పటి పాత ఫోటోల్నే పాపం ఫ్యాన్స్ తిరగేసి చూసుకుంటున్నారు. అయితే ఇటీవల వరుసగా కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్న శ్రుతిహాసన్ కి ఏ దర్శకనిర్మాతా అవకాశం ఇచ్చినట్టు లేదు. ఇక రవితేజ సరసన శ్రుతి క్రాక్ లో నటిస్తోంది. తనతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. ఇక క్రాక్ నుంచి శ్రుతి రోల్ కి సంబంధించిన సిసలైన లుక్ రివీల్ కాలేదింకా. ఇకపై ఎట్టి పరిస్థితిలో అవకాశాలు అందుకోవాలంటే ఫ్యాన్స్ లో వేడి పెంచడమే శరణ్యం అని భావించినట్టుంది. ఇటీవల వరుస ఫోటోషూట్లతో వేడెక్కించేస్తోంది. తాజాగా శ్రుతి పాత ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో అంతే వైరల్ గా మారాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-