బాలీవుడ్ కోసమేనా ఈ కఠోర శ్రమ?

0

వృత్తిగత జీవితం.. వ్యక్తిగత జీవితం ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేయనిదే మనిషి జీవితానికి సార్థకత లేదు. సరిగ్గా ఇదే ఆలోచనతో కెరీర్ పీక్స్ లో ఉండగానే శ్రుతిహాసన్ వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిస్తూ కొత్త దారిలో వెళ్లింది. విదేశీ బోయ్ ఫ్రెండ్ తో ప్రేమాయణం ఆ తర్వాత మెలోడ్రామా గురించి బ్రేకప్ గురించి తెలిసిందే. లైఫ్ సర్కిల్ తిరిగి బొంగరంలా అక్కడికే తిరిగి వస్తుంది! అన్న చందంగా.. అన్ ప్లాన్డ్ ఎపిసోడ్స్ అన్నీ పూర్తయ్యాక తిరిగి శ్రుతి యూటర్న్ తీసుకుని సినిమాల్లో బిజీ అవుతోంది. ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రం తెలుగులో ఓ చిత్రానికి ఇటీవల కమిటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమిళ చిత్రంతో బిజీగా ఉంది.

అయితే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూనే ఈ అమ్మడు తిరిగి పాత రూపానికి మారేందుకు జిమ్ముల్లో కఠోరంగా శ్రమిస్తోంది. అందుకు సంబంధించి లేటెస్టుగా శ్రుతి రివీల్ చేసిన ఓ ఫోటో వేడెక్కిస్తోంది. విదేశీ జిమ్ కోచ్ & స్టంట్ ఉమెన్ ఎస్ జిల్వీ తనకు జిమ్ లో వ్యక్తిగత శిక్షకురాలిగా సాయం చేస్తున్నారు. శ్రుతి లుక్ ప్రస్తుతం చాలా మారిపోయింది. మునుపటిలా సన్నజాజి తీగలా ఛేంజోవర్ కనిపిస్తోంది. అప్పుడే ఆ నడుము పిడికిలికి చిక్కేంత సన్నగా అయిపోయింది. ట్రైనింగ్ హార్డ్ విత్ బెస్ట్! అంటూ శ్రుతి స్వయంగా ఈ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది.

అయితే శ్రుతి ఉన్నట్టుండి మరీ ఇంత హార్డ్ వర్క్ ఎందుకు? అన్న సందేహం అభిమానుల్లో వ్యక్తం అవుతోంది. త్వరలోనే బాలీవుడ్ లోనూ రీఎంట్రీ ఇచ్చేందుకు ఇది సన్నాహకమా? కోల్పోయిన ఫామ్ ని తిరిగి తెచ్చేందుకు ప్లాన్ వేసిందా? అన్న డౌట్ పుడుతోంది. ఇకపోతే శ్రుతి సహృదయం ఉన్న నటి. జాలి..దయ.. సహకార గుణం ఉన్న తనకు ఎలాంటి రుగ్మతలు రావని.. తను ఎంతో ఆరోగ్యంగా ఓ పూదోట విహారిలా ఉంటుందని ఒక ఆర్జే ఈ ఫోటోకి రిప్లయ్ ఇవ్వడం ఆసక్తికరం.
Please Read Disclaimer