ఐ హేట్ వాలెంటైన్స్ డే: శృతి హాసన్

0

డైనమిక్ లేడీ మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ ప్రతి ఎపిసోడ్ కూడా సంచలనాలు నమోదు చేస్తోంది. ఫ్రాంక్ గా బోల్డ్ గా మంచు లక్ష్మి ప్రశ్నలు సంధించడం.. అతిథులు అంతకంటే ఓపెన్ గా సమాధానాలు ఇవ్వడంతో అవి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇప్పటికే సమంతా తమ వివాహానికి ముందే చైతుతో లివిన్ రిలేషన్ లో ఉన్నానని బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా మంచు లక్ష్మి షోకు శృతి హాసన్ అతిథిగా వచ్చింది.

ఈ షోలో ‘ఏస్2త్రీ సీక్వెన్స్’ లో మూడు ప్రశ్నలు అడిగితే అందులో ఒకటి “ఇప్పటి వరకూ మీ జీవితంలో బెస్ట్ వ్యాలెంటైన్స్ డే ఏది?” ఈ ప్రశ్నకు శృతి “ఐ హేట్ వాలెంటైన్స్ డే” అంటూ పెద్ద షాక్ ఇచ్చింది. ఎందుకో వివరిస్తూ “యాక్చువల్ గా ఈ వాలెంటైన్ డే కాన్సెప్ట్ ను తీసుకొచ్చిన ఇడియట్ ఫెలో ఎవరు? నేను మా స్కూల్ లో అబ్బాయిలలో ఒకదాన్ని. డే మచ్చా.. క్రికెట్ ఆడదాం రా అని ఫ్రెండ్స్ ను పిలిచే టైపు. అందుకే వాలెంటైన్ డే నాకు చాలా డిప్రెషన్ డే. నాకు నో వాలెంటైన్ డే కార్డ్స్.. నో ఫ్లవర్స్ నథింగ్. 11 స్టాండర్డ్ వరకూ ఈ గోల చూసిన నా బెస్ట్ ఫ్రెండ్ ఒకరు.. ఎవరూ శృతిని ఫ్లర్ట్ చెయ్యలేదు.. కార్డ్ ఇవ్వడం లేదని జాలిపడి.. నువ్వు నా వాలెంటైన్ అవుతావా అని అడిగాడు నాకు కోపం వచ్చి ‘ఒక్కటిస్తా..వెళ్ళిపో నా దగ్గర్నుంచి’ అన్నాను. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఇప్పటికీ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్” అంటూ తన వాలెంటైన్ డే కష్టాలు చెప్పుకొచ్చింది.

శృతి ఇదంతా వివరిస్తున్నప్పుడు మంచు లక్ష్మి మేడమ్ రెస్పాన్స్.. హావభావాలు అదిరిపోయాయి. ఇదొక్కటే కాకుండా ఎన్నో విషయాలు శృతి పంచుకుంది. ఎన్టీఆర్.. మహేష్.. అల్లు అర్జున్ లలో ఒకరిని పెళ్ళి చేసుకోవాలంటే ఎవరిని ఎంచుకుంటావు అని అడిగితే.. ఎవరిని చేసుకుంటుంది అనే విషయం చెప్పలేదు కానీ వారి మ్యారీడ్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఎన్టీఆర్ వైఫ్ గురించి తనకు తెలియదని.. అల్లు అర్జున్ వైఫ్ స్నేహతో పరిచయం ఉంది కానీ వారి మ్యారీడ్ లైఫ్ ఎలా ఉందో తెలియదని చెప్పింది.. అయితే మహేష్ – నమ్రతల వైవాహిక జీవితం సరదాగా ఉంటుందని వ్యాఖ్యానించింది.