అప్పుడే శ్రుతిహాసన్ కి 10 ఏళ్ళు?

0

2000 లో `హేరామ్` సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది శ్రుతిహాసన్. కమల్ హాసన్ గారాల పట్టీగా పరిశ్రమకు సుపరిచితమైంది. 2009లో `లక్` అనే బాలీవుడ్ చిత్రంతో కథానాయిక అయ్యింది. సిద్ధార్థ్ సరసన `అనగనగ ఒక ధీరుడు` తెలుగులో తొలి చిత్రం. `గబ్బర్ సింగ్` తో కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ అందుకుంది. పవన్ సరసన ఈ చిత్రంలో భాగ్యలక్ష్మి పాత్రలో నటించి ఆకట్టుకుంది. అటుపై శ్రుతి కెరీర్ గురించి తెలిసిందే. తెలుగు-తమిళ పరిశ్రమల్లో అగ్ర కథానాయికగా ఎదిగింది. హిందీలోనూ స్టార్ డమ్ ని పెంచుకుంది. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే శ్రుతి వ్యక్తిగత జీవితం ముఖ్యం అంటూ సినిమాలకు విరామం ఇచ్చింది. విదేశీ బోయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేతో ప్రేమాయణం సాగించింది. ఇక అతడిని పెళ్లాడేయబోతోందనే ప్రచారం సాగింది. కానీ ఇంతలోనే మనస్ఫర్థలతో విడిపోయి ఇప్పుడు తిరిగి సినీ కెరీర్ పై దృష్టి సారించింది.

ప్రస్తుతం కోలీవుడ్ లో విజయ్ సేతుపతి సరసన `లాభం` అనే చిత్రంలో నటిస్తోంది. టాలీవుడ్ లో రవితేజతో ఒక చిత్రం చేయనుంది. అలాగే మ్యూజిక్ బ్యాండ్- విదేశీ కాన్సెర్టుల తో వచ్చిన క్రేజు శ్రుతి కి కలిసొచ్చింది. అమెరికన్ క్రేజీ వెబ్ సిరీస్ `ట్రెడ్స్టోన్`లో శృతి హాసన్ కీలక పాత్రకు ఎంపికైంది. రామిన్ బహ్రానీ ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించనున్నారు. కెరీర్ 10 ఏళ్ళు పూర్తయిన ఆనందంలో శృతి హాసన్ తన ఇన్ స్టాగ్రమ్ ద్వారా అభిమానులకి కృతజ్ఞతలు తెలియజేసింది.

“నేటితో సినీపరిశ్రమలో నా కెరీర్ పదేళ్లు పూర్తయింది. ఇక్కడ ఎంతో నేర్చుకున్నాను. నన్ను ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదాలు. మీరంతా గర్వించేలా హార్డ్ వర్క్ చేస్తానని.. మరింత బెటర్ గా వర్క్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నా“ అని శ్రుతిహాసన్ ఎమోషనల్ గా వ్యాఖ్యానించింది. ఇకపై కెరీర్ ని భాగ్యలక్ష్మి ఎలా పరుగులు పెట్టించనుందో చూడాలి.
Please Read Disclaimer