బుడాపెస్ట్ లో శ్రుతి ఏం చేస్తోంది!

0

సినిమాలు లేకపోయినా షికార్లకు మాత్రం కొదవేం లేదు. షూటింగ్ ల కోసం విదేశాలు చుట్టొచ్చే ముద్దు గుమ్మలు తీరికవేళల్లో కూడా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. లేట్ నైట్ పార్టీల్లోనూ ఏ మాత్రం తగ్గడం లేదు. విదేశాలు చుట్టేస్తూ హంగామా చేస్తూనే వున్నారు. తెలుగు.. హిందీ.. తమిళ భాషల్లో గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శృతిహాసన్ ఈ మధ్యే రెండు చిత్రాల్ని అంగీకరించింది. అందులో ఒకటి తమిళంలో విజయ్ సేతుపతి హీరొ నటిస్తూ నిర్మిస్తున్న `లాభం` .. వేరొకటి నటుడు దర్శకుడు మహేష్ మంజ్రేకర్ రూపొందిస్తున్న హిందీ చిత్రం `పవర్`. ఈ సినిమాల తాజా సమాచారం లేదింతవరకూ.

2017 తరువాత శృతి నటించిన సినిమా ఏదీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయినా సరే తన కెరీర్ విషయంలో ధీమాగా వున్న శృతిహాసన్ ప్రస్తుతం బుడాపెస్ట్ (హంగరీ)లో ఎంజాయ్ చేస్తోంది. శృతి అక్కడ ఏం చేస్తోందో తెలుసా? ఇదిగో ఇలా తాన తందానా అంటూ డ్యాన్సులాడుతోంది. తనో మ్యూజిక్ లవర్ అన్న విషయం తెలిసిందే. గతంలో మ్యూజిక్ కాన్సెర్ట్స్ని కండక్ట్ చేసిన శృతి బుడాపెస్ట్ లో సిజెట్ 2019 పేరుతో జరుగుతున్న మ్యూజిక్ ఫెస్టివల్ లో ప్రదర్శన ఇస్తోంది. అక్కడ జరుగుతున్న ఈవెంట్ లో పాల్గొన్న శ్రుతి అందుకు సంబంధించిన ఫొటోలతో పాటు ఓ వీడియోని సోషల్ మీడియా ద్వారా అభిమానుల కోసం షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు.. వీడియోలు జోరుగా వైరల్ అవుతున్నాయ్.

అలాగే కథానాయికగా కెరీక్ ప్రారంభించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాల్ని షేర్ చేసింది. నేను ఈ స్థాయిలో వున్నానంటే దానికి నన్ను అభిమానించిన ప్రేక్షకులు.. ఫిల్మ్ మేకర్స్.. కో స్టార్స్ సపోర్ట్ ప్రధాన కారణమని చెప్పుకొచ్చింది. నేను ఏ సినిమా చేసినా ప్రేక్షకులు అక్కున చేర్చకున్నారని.. వారి సహకారం వల్లే ఈ స్థాయికి రాగలిగానని వెల్లడించింది.

 

View this post on Instagram

 

Always support musicians !!! 😂🤣🤣

A post shared by @ shrutzhaasan on
Please Read Disclaimer