ఎక్కువే డిమాండ్ చేసింది.. తక్కువకే ఒప్పుకుంది!

0

కమల్ హాసన్ ముద్దుల కూతురిగా ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి హాసన్ రూటు మొదటి నుంచి సెపరేటు. శృతి కెరీర్ లో అప్ అండ్ డౌన్లు అన్నీ ఉన్నాయి. అయితే ఈమధ్య రీ ఎంట్రీ ఇచ్చి మరొసారి హీరోయిన్ గా సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తమిళంలో విజయ్ సేతుపతితో ‘లాబం’ అనే సినిమాలో నటిస్తోంది. ఇక తెలుగులో కూడా కొన్ని ఆఫర్లు వచ్చాయి కానీ రెమ్యూనరేషన్ విషయంలో బెట్టు చేయడంతో ఫైనలైజ్ కాలేదట. అయితే ఇప్పుడు మెట్టు దిగిరావడంతో శృతికి ఓ సినిమా ఫిక్స్ అయిందని సమాచారం.

మాస్ మహారాజా రవితేజ – గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో ఒక సినిమా పట్టాలెక్కుతోంది. ఈ సినిమాలో రవితేజకు జోడీగా శృతిని అనుకున్నారట. హీరోయిన్ ఆఫర్ తో ఆమెను సంప్రదించారట. అయితే శృతి ఎప్పటిలాగే హై రెమ్యూనరేషన్ చెప్పిందట. నిర్మాతలు బేరమాడినా పెద్దగా డిస్కౌంట్ ఇవ్వలేదట. శృతికి ‘గబ్బర్ సింగ్’ తర్వాత చాలా డిమాండ్ ఉండేది. ఇక ‘రేస్ గుర్రం’.. ‘శ్రీమంతుడు’ సినిమాల సమయంలో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునేది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఫీజ్ డిమాండ్ చేయడంతో చిక్కొచ్చింది. దీంతో టాలీవుడ్ నిర్మాతలు కూడా శృతికి ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ఇచ్చే పరిస్థితి లేదంటూ ఊరుకున్నారట. టాలీవుడ్ లో వేరే అవకాశాలు కూడా రాకపోవడంతో ఫైనల్ గా తత్త్వం బోధపడి శృతి తన రెమ్యూనరేషన్ తగ్గించుకుందని సమాచారం. రవితేజ సినిమాకు రూ. 75 లక్షల రెమ్యూనరేషన్ కు ఒకే చెప్పిందట.

రవితేజ – గోపించంద్ మలినేని సినిమా శృతికి టాలీవుడ్ లో రీఎంట్రీ అవుతుంది. శృతికి మొదటి నుంచి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉండడం వల్లే ఆమెను హీరోయిన్ గా తీసుకునేందుకు నిర్మాతలు ఇప్పటికీ ముందుకొస్తున్నారు. ఆఫర్లు అయితే వస్తున్నాయి కానీ శృతి తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా విజయాలతో సత్తా చాటుతుందా అనేది వేచి చూడాలి.
Please Read Disclaimer