ప్రభాస్ పాలిటిక్స్ లోకి వస్తాడా?

0

డార్లింగ్ గా బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ కొత్త సినిమా సాహో కోసం యావత్ భారత దేశం ఎదురు చూస్తోంది. రెండువందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ విజువల్ వండర్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనుకోని మూవీ లవర్ లేడు. స్టార్ గా తన మార్కెట్ ని ఇప్పటికే వందల వేల కోట్ల రేంజ్ కి తీసుకెళ్లిన ప్రభాస్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఇప్పుడు చర్చ రావడం ఆశ్చర్యమే.

అయితే అది తానుగా వ్యక్తపరిచింది కాదు. డార్లింగ్ పెద్దమ్మ కృష్ణంరాజు గారి సతీమణి శ్యామలదేవి దీని గురించి ఓ మీడియా ఇంటర్వ్యూలో ప్రస్తావించడం వల్ల ఇప్పుడీ టాపిక్ వచ్చింది. భవిష్యత్తులో ప్రభాస్ ఎప్పుడైనా రాజకీయాల్లోకి రావొచ్చని అలాంటి అవసరం ఉందనిపించినప్పుడు రావడం తప్పేమి లేదన్న తరహాలో ఆవిడ చెప్పారు.

గతంలో పెదనాన్న కృష్ణంరాజు గారు సైతం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండేవారు కానీ ఆశించిన స్థాయికి చేరుకోలేదన్నది నిజం. ఇప్పటికీ బిజెపిలోనే కొనసాగుతున్న ఆయన గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.

కానీ ప్రభాస్ గురించి ఇలాంటి టాపిక్ ఇప్పుడే రావడం తొందరపాటు అవుతుంది. ఇంకా చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. బాహుబలి సాహోలకే ఏడేళ్ల కెరీర్ ని పణంగా పెట్టి దానికి తగ్గట్టే గొప్ప ఫలితాన్ని అందుకున్నప్పటికీ ఇకపై ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేయాలనీ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఈ క్రమంలో పాలిటిక్స్ అనే ఆలోచన సబబు కాదు. మనోడి మీద ప్రేమతో పెద్దమ్మ అలా అన్నారు తప్ప ఇప్పట్లో ఇది జరిగే పని కాదనే సత్యం అందరికి తెలిసిందే.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home