సిడ్ శ్రీరామ్.. కొన్ని రోజులు బ్రేక్?

0

ఈ తరం లో తెలుగు లో యువ ప్రేక్షకుల కు అత్యంత ఇష్టమైన మేల్ సింగర్ ఎవరు అని అడిగితే ఎవరైనా తడుము కోకుండా సిడ్ శ్రీరామ్ పేరు చెప్పేస్తారు. సిడ్ ఏ పాట పాడినా అది సూపర్ హిట్ గా మారుతోంది. తమిళుడు కావడం తో తెలుగు ఉచ్చారణా దోషాలు ఉన్నాయని కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ సిడ్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. నిజానికి ఏదైనా సినిమా లో సిడ్ పాడిన సూపర్ హిట్ సాంగ్ ఉంటే ఆ సినిమాకు కొన్ని ఎక్స్ ట్రా టికెట్స్ తెగినట్టేనని టాక్ ఉంది. అయితే ఇంత టాప్ సింగర్ వాయిస్ పండుగ తర్వాత కొంత కాలం వినిపించక పోవచ్చని అంటున్నారు.

మణిరత్నం సినిమా విషయం లో మణి సారు కు సిడ్ శ్రీరామ్ కు ఏదో తీవ్రమైన డిస్కషన్ జరిగిందని.. దీంతో సిడ్ అలిగి అమెరికా కు వెళ్ళి పోయాడని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మరి వారి మధ్య ఏం చర్చ జరిగింది.. సిడ్ ఎందుకు అలిగాడని విషయం బయటకు రాలేదు. మన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు పాటల కోసం సిడ్ ను కాంటాక్ట్ చేస్తుంటే ఫోన్ తీయడం లేదని.. రెస్పాన్స్ ఇవ్వడం లేదని అంటున్నారు. ఇలా కనుక మరి కొన్ని రోజులు కొన సాగితే మ్యూజిక్ డైరెక్టర్ లు ఆ పాటలను వేరే గాయకుల తో పాడించడం ఖాయమే.

వ్యక్తిగత సమస్యలు ఏవి ఉన్నా వృత్తి విషయం లో వాటిని తీసుకురాకూడదు. వర్క్ విషయం లో సంప్రదిస్తున్న వారికి బదులివ్వడం అనేది కనీస బాధ్యత. కెరీర్ అద్భుతంగా కొనసాగుతున్న సమయం లో ఇలా చేసుకంటే అది సిడ్ కే నష్టమని ఆయన శ్రేయోభిలాషులు వ్యాఖ్యానిస్తున్నారు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home