తగువుకు లేస్తున్న బొమ్మరిల్లు హీరో

0

అప్పుడెప్పుడో దశాబ్దం క్రితం హీరో సిద్దార్థ్ ఇక్కడ మంచి ఫాలోయింగ్ తో మార్కెట్ కూడా ఉండేది. మినిమమ్ గ్యారెంటీ హీరోగా వసూళ్లకు సైతం లోటు లేకుండా నడిచేది. అయితే వరస పరాజయాలు క్రమంగా అతన్ని టాలీవుడ్ కు దూరం చేసాయి. దీంతో చెన్నైలో మకాం పెట్టి తమిళ సినిమాలు చేసుకుంటూ అక్కడే సెటిలై పోయిన సిద్దార్థ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. రెండేళ్ల క్రితం గృహంతో ఇక్కడా డీసెంట్ హిట్ కొట్టినప్పటికీ దాన్ని ఆ తర్వాత కాలంలో నిలబెట్టుకోలేకపోయాడు.

తాజాగా నయనతార మీద అభ్యంతర కామెంట్స్ తో అల్లరిపాలైన సీనియర్ ఆర్టిస్ట్ రాధారవి విషయంలో సిద్దు చేసిన కామెంట్స్ కొత్త వివాదానికి దారి తీస్తున్నాయి. మీటూ ఉద్యమం సమయంలో మౌనంగా ఉన్న ఇండస్ట్రీ పెద్దలు ఇప్పుడు నయనతార విషయంలోనే ఇంతగా ఎందుకు రియాక్ట్ అవుతున్నారో అర్థం కావడం లేదని కాస్టింగ్ కౌచ్ విషయంలో సైలెంట్ గా ఉన్నవాళ్లకు మద్దతు తెలపడంలో ఆంతర్యం వాళ్ళకే తెలియాలని కాస్త ఘాటుగానే విమర్శించాడు. ఇది ఒకరకంగా రాధారవిని సమర్థిస్తున్న ఉద్దేశంలో కనిపించింది.

దీంతో నయన్ కాబోయే భర్త దర్శకుడు విగ్నేష్ శివం దానికి ధీటుగా బదులిస్తూ నయనతార మీటూ గురించి బహిరంగంగా మాట్లాడలేకపోయినా బాధితులకు సహాయం చేయడం సినిమాల్లో వేషాలు ఇప్పించడం లాంటివి ఎన్నో చేసిందని చెప్పాడు. అవి పబ్లిసిటీ చేసుకునే మార్గం తెలియకపోవడం నయన్ బలహీనత అంటూ చురక వేశాడు. చూస్తుంటే రాధారవి వివాదం చాలా దూరం వెళ్లేలా ఉంది. ఇప్పటికే కొందరు నిర్మాతలు బ్యాన్ చేయగా డీఎంకే పార్టీ సస్పెండ్ చేసింది. ఇంత బ్రతుకు బ్రతికి ఇంటివెనుక ఏదో కావడం అంటే ఇదేనేమో.
Please Read Disclaimer