బాహుబలి క్రేజ్ తో అక్కడ ‘సైలెన్స్’

0

సౌత్ ప్రేక్షకులను దశాబ్ద కాలంకు పైగా ఎంటర్ టైన్ చేస్తున్న ముద్దుగుమ్మ అనుష్క. బాహుబలి చిత్రంతో అనుష్క క్రేజ్ బాలీవుడ్ కు కూడా పాకింది. బాహుబలి 2 చిత్రం విడుదలైన తర్వాత ఈమెకు బాలీవుడ్ నుండి కూడా ఆఫర్లు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే సైజ్ జీరో కోసం బరువు పెరగడంతో దాన్ని తగ్గించుకునే క్రమంలో కాస్త గ్యాప్ తీసుకుంది. భాగమతి చిత్రం తర్వాత అనుష్క మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. గ్యాప్ తర్వాత అనుష్క ‘సైలెన్స్’ అనే చిత్రంలో నటిస్తోంది.

అనుష్కకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని మూడు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు కొన్ని ముఖ్య సీన్స్ ను హిందీ మరియు తమిళంలో స్పెషల్ గా చిత్రీకరిస్తున్నారట. ఇక మూడు వర్షన్ లకు కూడా కొన్ని పాత్రలకు సంబంధించిన నటీనటులు మారబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. తెలుగులో ‘నిశబ్దం’గా రిలీజ్ కాబోతుండగా తమిళం మరియు హిందీలో సైలెన్స్ టైటిల్ తో విడుదల కాబోతుంది.

బాహుబలి తో వచ్చిన క్రేజ్ కారణంగా ‘సైలెన్స్’ చిత్రానికి బాలీవుడ్ లో మంచి బిజినెస్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. బాహుబలి చిత్రంతో ప్రభాస్ బాలీవుడ్ లో పెద్ద స్టార్ అయ్యాడు. ఆ చిత్రం టెక్నీషియన్స్ మరియు నటీనటులు అంతా కూడా బాలీవుడ్ లో నోటెడ్ అయ్యారు. బాహుబలి స్టార్ గా ‘సైలెన్స్’ చిత్రాన్ని అక్కడ ప్రమోట్ చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. షూటింగ్ సగం పూర్తి చేసుకున్న ఈ చిత్రంను దసరాకు కాస్త అటు ఇటుగా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం గురించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెళ్లడయ్యే అవకాశం ఉంది.
Please Read Disclaimer