సైలెంట్ అప్ కమింగ్ స్టార్స్ కొత్త టార్గెట్ ని రీచ్ అయ్యేనా…?

0

టాలీవుడ్ లో ఈ మధ్య పాన్ ఇండియా మూవీ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. క్రేజ్ తో ఇమేజ్ తో సంబంధం లేకుండా ప్రతి హీరో పాన్ ఇండియా మూవీస్ ని అనౌన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా తమ చిత్రాలు రిలీజ్ చేసి మార్కెట్ చేసుకోవాలని హీరోలందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని స్టార్ హీరోల సినిమాలు పాన్ ఇండియా లెవల్లో రిలీజై సక్సెస్ సాధించాయి. అయితే అసలు సొంత భాషలో సినిమాలు రిలీజైతే కూడా సరిగా ప్రేక్షకులు థియేటర్లకు రాని హీరోలు కూడా ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అనౌన్స్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక్కడ క్రేజ్ లేని హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా ఎలా మారుతారని అనుకుంటున్నారని సినీ అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రకటించడానికి కారణమేంటని అడిగితే ‘ఇక్కడ నచ్చని వారు ఎక్కడో అక్కడ నచ్చే అవకాశం ఉంది కదా’ అనే లాజిక్ చెబుతున్నారట. దీంతో పాన్ ఇండియా అంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో కామెడీ అయిపోయింది.

కాకపోతే పాన్ ఇండియాని టార్గెట్ చేస్తున్న హీరోలు దర్శకనిర్మాతలు మాత్రం దీనిని చాలా సీరియస్ గానే తీసుకుంటున్నారట. ఈ క్రమంలో తాజాగా ఓ ప్లాప్ హీరో కూడా ఈ పాన్ ఇండియా సినిమాల లిస్ట్ లోకి వచ్చి చేరాడు. చాలా ఏళ్లుగా ఈ హీరోకి తెలుగులో హిట్ లేదు. ఈ నేపథ్యంలో సదరు హీరోకి హిట్ కంపల్సరీగా కావాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది. అయితే ప్లాపులతో సంబంధం లేకుండా ఆ హీరోకి ఉన్న బ్యాగ్రౌండ్ తో అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఆ హీరోకి ఓ పాన్ ఇండియా కాన్సెప్ట్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. అయితే అతను రెగ్యులర్ గా ఇక్కడ చేస్తున్న తప్పను ఈ పాన్ ఇండియా సినిమాకి చేయడం లేదని తెలుస్తోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాల నుంచి బయటకు వచ్చి ఈ పాన్ ఇండియా మూవీ కోసం ఓ క్రైమ్ థ్రిల్లర్ ని ఎంచుకున్నాడు. మరి ఈ పాన్ ఇండియా సినిమాతో సక్సెస్ కొడతాడేమో చూడాలి.

ఇక ఇదే బాటలో పలువురు చిన్న హీరోలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇండస్ట్రీలో పదేళ్ల నుండి ఒకే హిట్ తో నెట్టుకొస్తున్న ఓ హీరో కూడా ఓ పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నాడట. దీని కోసం హారర్ థ్రిల్లర్ నేపథ్యం ఉన్న స్టోరీతో ఎటాక్ చేయబోతున్నాడట. ఈ హీరోకి హిందీ వెబ్ సిరీస్ లో నటించిన అనుభవం మరియు తమిళ్ సినిమాల్లో యాక్ట్ చేసిన ఎక్సపీరియన్స్ ఉండటంతో పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ అవొచ్చని ఆలోచిస్తున్నాడట. వీరితో పాటు ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి ఒక్క సినిమాతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో కూడా ఇదే పంథాలో పాన్ ఇండియా మూవీ ప్లాన్స్ చేస్తున్నాడట. హిందీలో సపోర్టింగ్ రోల్స్ చేసిన అనుభవంతో ఓ కామెడీ థ్రిల్లర్ ని పాన్ ఇండియా లెవల్లో ట్రై చేయబోతున్నాడట. ఇక్కడి దాకా అంతా బాగానే ఉన్నా ఈ సినిమాల వలన వీరికి దర్శకనిర్మాతలకు ఏ మేరకు వర్కౌట్ అవుద్దో చూడాలి. మరి ఈ సైలెంట్ అప్ కమింగ్ స్టార్స్ వారి కొత్త టార్గెట్ ని రీచ్ అవుతారో లేదో లెట్స్ వెయిట్ అండ్ సీ…!