స్టార్ హీరోల వారసుల సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ అప్పుడేనా…?

0

సినీ ఇండస్ట్రీలో టాలెంట్ తో పని లేకుండా.. యాక్టింగ్ వచ్చినా రాకున్నా.. బ్యాగ్రౌండ్ ఉంటే చాలు నట వారసులు అడుగుపెట్టేయవచ్చు. ఒక్కరు ఇండస్ట్రీలో అడుగుపెడితే వారి నుండి యాక్టర్స్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతూనే ఉంటారు. ఇది మన ఒక్క టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకే పరిమితం కాలేదు.. అన్ని ఇండస్ట్రీలలో తమ నట వారసులను పరిచయం చేస్తూ వస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి డజను మంది.. అక్కినేని ఫ్యామిలీ నుండి అర డజను మంది ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అలానే నందమూరి ఫ్యామిలీ నుండి.. దగ్గుబాటి ఫ్యామిలీ.. ఘట్టమనేని ఫ్యామిలీ నుండి కూడా టాలీవుడ్ కి నటీనటులు పరిచయమయ్యారు. వారిలో చాలా మంది తమ టాలెంట్ నిరూపించుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. అయితే ఒకరిద్దరు మాత్రం మొదటి సినిమాకే పరిమితం అయ్యారు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. వాటిని అందుకోవడంలో సక్సెస్ అయిన వారు మాత్రమే ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇకపోతే గత కొంతకాలంగా అందరి చూపు మెగా వారసుడు అకీరా.. ఘట్టమనేని వారసుడు గౌతమ్ కృష్ణ.. నందమూరి వారసుడు మోక్షజ్ఞ పైనే ఉంది. వారి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడు అనే ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి.

బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా అడుగుపెడతాడని ఇప్పటికే బాలయ్య ప్రకటించారు. ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లు మోక్షజ్ఞ కోసం స్టోరీస్ కూడా రెడీ చేస్తున్నారు. త్వరలోనే మోక్షజ్ఞ వెండితెరపై అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు వారసుడు గౌతమ్.. పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ లు ఎప్పుడు ఎంట్రీ ఎప్పుడనే దానిపై ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు. ఇక వారి వారసులుగా వస్తున్నారంటే వారిపై ఇంకా ప్రెజర్ ఉంటుంది.. బాధ్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహేష్ తనయుడు గౌతమ్ ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి అభిమానులను పలకరించాడు. ప్రస్తుతం స్టడీస్ మీద ఫోకస్ పెట్టిన గౌతమ్ సిల్వర్ స్క్రీన్ మీద హీరోగా ఎంట్రీ ఇస్తాడని అర్థం అయిపోయింది. ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన మహేష్.. గౌతమ్ ఎంట్రీ గురించి ఎంట్రీ ఎప్పుడు అనేది కాలమే నిర్ణయిస్తుందని వెల్లడించాడు. పవన్ తనయుడు అకీరా నందన్ కూడా తల్లి రేణు దేశాయ్ దర్శకత్వం లో వచ్చిన మరాఠీ సినిమా ‘ఇష్క్ వాలా లవ్’లో నటించాడు. అయితే ప్రస్తుతం అకీరా చదువు మీద ద్రుష్టి పెట్టాడని రేణు దేశాయ్ చెప్పారు. మరి పెద్దయ్యాక సినిమాల్లోకి వస్తాడా అనే దాని మీద మాత్రం ఆమె ఎప్పుడు క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే అకీరా కూడా సినిమాల్లోకి వస్తే బాగుంటుందని మెగా ఫ్యామిలీ సభ్యులు మరియు పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే మహేష్ – పవన్ నట వారసుల ఎంట్రీపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Please Read Disclaimer