డర్టీ భామ టూమచ్ డర్

0

వెటరన్ నిర్మాత కం దర్శకుడు ఎం.ఎస్ రాజు `డర్టీ హరి` అనే ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న చేస్తోన్న సంగతి తెలిసిందే. క్లాస్ టచ్ ఉన్న ప్రేమకథలు…సెన్సిబుల్ కథాంశాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్న దర్శక నిర్మాత గా రాజుగారికి ప్రత్యేక ఐడెంటిటీ ఉంది. ఆయన అభిరుచికి భిన్నంగా వెళుతూ తొలిసారి బోల్డ్ కంటెంట్ ని ఎంచుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ ప్రారంభించి కొన్ని నెలలు అయినా షూటింగ్ కి సంబంధించిన వివరాలేవీ చెప్పలేదు. సడెన్ గా కొత్త సంవత్సరంలో ఆయన నుంచి ప్రకటన వచ్చింది. డర్టీ హరి అంటూ టైటిల్ తో నే ఆకర్షించారు. హాట్ హాట్ పోస్టర్లతో మాత్రం ఆడియన్స్ అటెన్షన్ డ్రా చేసారు.

ఇప్పటికే రెండు పోస్టర్లతో రచ్చ చేశారు. తాజాగా డర్టీ హరి నుంచి మూడవ పోస్టర్ బయటకు వచ్చింది. ఇందులో మెయిన్ లీడ్ పోషిస్తోన్న సిమ్రత్ కౌర్ హాట్ హాట్ ఫోజులతో వేడెక్కించింది. టాప్ లో బ్లాక్ కలర్ స్కిన్ టైట్ ఇన్నర్ వేర్..బాటమ్ లో అదే కలర్ స్కిన్ టైట్ ప్యాంట్ లో హాట్ లుక్ లో దర్శనమిస్తోంది. మెడలో శిలువను ధరించిన ఈ బ్యూటీ నాభి అందాల ఆరబోతకు వెనకాడలేదు. విరహంతో రగిలిపోతున్న మగువను ఈ పోస్టర్ లో ఆవిష్కరించారు. కుర్రకారు టార్గెట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. ఇక… టీజర్- ట్రైలర్ తో మరింత హీటెక్కించడం ఖాయమనే అంచనాలు ఏర్పడ్డాయి.

డర్టీ హరి చిత్రంలో మరో నాయికగా చిలసౌ ఫేం రుహని శర్మ నటిస్తోంది. శ్రవణ్ రెడ్డి అనే కొత్త కుర్రాడు హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ పూర్తయింది. షూటింగ్ క్లైమాక్స్ చేరుకుందని సమాచారం. బ్యాలెన్స్ పనులు పూర్తిచేసి ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాకాలు చేస్తున్నారుట. ఈ చిత్రంతో ఎమ్మెస్ రాజు దర్శకుడిగా కంబ్యాక్ అవుతారేమో చూడాలి.
Please Read Disclaimer