భార్యను వేదించి అరెస్ట్ అయిన ప్రముఖ సింగర్

0

తమిళనాట ప్రముఖ సింగర్ గా గుర్తింపు ఉన్న ధరణిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన ప్రముఖ సినీ గాయకుడు పజని కుమారుడు. కోలీవుడ్ లో పజనికి మంచి పేరుంది. చాలా ఏళ్లుగా వందల పాటలు పాడిన రికార్డు ఆయనకు ఉంది. ఆయన వారసుడిగా ధరణి కూడా సింగర్ గా పరిచయం అయ్యాడు. పలు హిట్ పాటలను పాడిన ధరణి కి కూడా కోలీవుడ్ లో మంచి పేరుంది. అలాంటి ధరణి అక్రమ సంబంధం పెట్టుకుని ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్న భార్యను వేదించాడట.

కేసు వివరాల్లోకి వెళ్తే… 34 ఏళ్ల ధరణి తన స్నేహితురాలైన విజయ భానును గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరు కూడా వారి ప్రేమను ఇంట్లో చెప్పడంతో ఇంట్లో వారు ఒప్పుకుని పెళ్లి చేశారు. ఆరు నెలల క్రితం ధరణి.. విజయ భాను పెళ్లి అయ్యింది. పెళ్లి సమయంలో విజయ కుటుంబ సభ్యులు భారీ మొత్తంలో కట్నం మరియు కానుకలు సమర్పించారు. పెళ్లి అయ్యేంత వరకు విజయ భానుపై చాలా ప్రేమను కురిపించిన ధరణి ఆ తర్వాత అతడి అసలు స్వరూపం బయటకు తీసుకు వచ్చాడు.

గత కొంత కాలంగా ధరణి తనకంటే 10 ఏళ్లు పెద్దది అయిన నిత్యా అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం విజయ భానుకు తెలియడంతో నిలదీసింది. దాంతో ధరణికి కోపం వచ్చిందట. ఆ కోపంలో విచక్షణ రహితంగా కొట్టాడని శారీరకంగా చిత్ర హింసలు పెట్టాడంటూ విజయ భాను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నిత్యా అనే మహిళకు గతంలో రెండు పెళ్లిలు అయ్యాయి. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ధరణితో సంబంధం పెట్టుకుని మరో పిల్లకు జన్మనిచ్చినట్లుగా పోలీసుల ఎంక్వౌరీలో తేలింది.

ధరణి భార్యను శారీరకంగా వేదించడంతో పాటు అదనపు కట్నం కోసం చిత్ర హింసలు పెట్టినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ధరణికి సాయంగా నిలిచారణ ఆరోపణతో ఆయన కుటుంబ సభ్యులందరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ మొదలు పెట్టారు. ఈ కేసులో నిత్యా పాత్ర విషయమై ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలియజేశారు.
Please Read Disclaimer