ల, దెతో స్టార్ట్ అయ్యే బూతులతో నన్ను తిట్టారు: సింగర్ చిన్మయి

0

చిన్మయి వివాదం మరింత ముదురుతోంది. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో సంచలన దర్శకుడిగా మారిన సందీప్ వంగ.. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దగ్గగా.. తెలుగులో మాదిరే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ముద్దు సన్నివేశాలు, హీరోయిన్‌పై హీరో చేయిచేసుకుని ప్రేమించమనడం తదితర సీన్స్‌పై విమర్శలు వస్తున్నాయి. అయితే తన చిత్రాన్ని సమర్ధించుకుంటూ.. ప్రేమికుల మధ్య ఒకరి చెంపపై ఒకరి కొట్టుకునేంత స్వేచ్ఛలేకపోతే వారి మధ్య ప్రేమ ఉంటుందని తాను అనుకోనని దర్శకుడు సందీప్ వంగా చేసిన చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు సింగర్ చిన్మయి.

ఈ సందర్భంగా సందీప్ వంగ చేసిన కామెంట్స్‌ను ట్విట్టర్ ద్వారా షేర్ చేసి.. కొట్టడం ప్రేమకు చిహ్నమా అని ప్రశ్నించారు. అయితే ఇష్యూతో సందీప్ వంగ, చిన్మయి మధ్య వివాదం రేగింది. అయితే చిన్మయి కామెంట్స్‌పై కొంతమంది నెటిజన్లు నెగిటివ్ ట్రోల్స్ చేస్తూ ఆమె వ్యక్తిగత జీవితంపై వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు.

వీటిపై స్పందిస్తూ మరో వీడియో విడుదల చేశారు చిన్మయి. ఇందులో చిన్మయి ఏమన్నారంటే.. ‘నీను నా టైం లైన్‌లో ట్వీట్స్ పెట్టి నా అభిప్రాయాన్ని వ్యక్త పరిచినందుకు చాలా మంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. లేనిపోని గోల చేసి పెంట చేస్తున్నారు. ఇండస్ట్రీ వ్యక్తి ఇంటర్వ్యూలో ఏదైనా మాట్లాడినప్పుడు దానిపై మన ఒపీనియన్ చెప్పడం చాలా నార్మల్. ఇప్పుడు నేను అదే చేశా.

ఆ మాత్రం దానికి నాపై మీ భర్త నీకు ఇంకా విడాకులు ఇవ్వలేదా? నీ భర్త ఇంకా చనిపోలేదా? నువ్ ఇంకా బతికే ఉన్నావా? అని.. తెలుగులో ఉంటాయి కదా.. ‘ల’ తో మొదలయ్యే బూతులు, ‘దె’తో స్టార్ట్ చేసే పదాలతో నన్ను పిచ్చి తిట్లు తిడుతున్నారు. చెప్పడానికి వీలు లేని బూతులు తిడుతున్నారు. మూడో ప్రపంచ యుద్ధం వచ్చినంతగా ఫీల్ అయిపోతున్నారు.

అతను (సందీప్ వంగా) చాలా పవర్ ఫుల్ మ్యాన్, చాలా సక్సెస్‌లో ఉన్న దర్శకుడే నేను ఒప్పుకుంటా. ఆయన తీసిన చిత్రానికి ఒక కథ ఉంది. అయితే ప్రాబ్లమ్ ఏంటంటే.. ఆయన క్రియేట్ చేసిన పాత్రలో జరిగేది వాస్తవం అంటే సమస్య ఏర్పడుతుంది.

లవ్‌లోని డెప్త్ ఆఫ్ ఎమోషన్స్‌లో ఉంటే.. ఒకర్నొకరు కొట్టుకొనవచ్చు. అయితే తెలుగు సినిమా పీపుల్స్ సినిమాకి కనెక్ట్ అయిపోతారు. అందుకే సినిమా ప్రారంభం అయ్యే ముందు సిగరెట్ మందు తాగటం లాంటివి ప్రమాదం అని చెప్తారు.

అలాగే ప్రేమించిన ప్రేయసిని కొట్టడమే అసలైన లవ్ అంటే ఎలా? మీరు నన్ను ఎన్ని బూతులు తిట్టినా? ఎన్ని అన్నా.. నాకు ఇంత కూడా ఎఫెక్ట్ కాదు. దాన్ని గ్రహిస్తే మంచిది. నన్ను తిట్టినా.. ఫెమినిస్ట్ అన్నా.. రాహుల్‌ నన్ను భరిస్తున్నాడని ఆయనపై సింపథీ చూపించినా నాకు మంచిదే’ అంటూ తనను హేట్ చేసే వారికి గట్టి కౌంటర్ ఇచ్చింది సింగర్ చిన్మయి.

భర్త రాహుల్‌తో చిన్మయి..

 

View this post on Instagram

 

What it takes to stay married to me 😂

A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) on
Please Read Disclaimer