మ్యూజిక్ డైరెక్టర్ కు సింగర్ ఘాటు కౌంటర్

0

మీటూ ఆరోపణల తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు అనుమాలిక్ ఎట్టకేలకు నోరు విప్పి.. తన మీద వస్తున్న ఆరోపణల పై కస్సుమనటం తెలిసిందే. ఇంత వయసులో ఇలాంటి నిందల్ని తాను భరించలేక పోతున్నట్లు గా ఫైర్ అయ్యాడు. నిజం బయట పడుతుందన్న ఉద్దేశం తో తాను ఇన్నాళ్లు మౌనం గా ఉన్నట్లు చెప్పారు.

తాను కామ్ గా ఉంటే నిజాలు వాటంతట అవే వస్తాయని భావించానని కానీ అలా జరగ లేదన్న ఆయన.. తన పేరు చెడగొట్టేందుకు వచ్చిన నిందలు తనను.. తన కుటుంబాన్ని చాలా బాధించినట్లు చెప్పారు. ఈ వయసు లో ఇలాంటి అసభ్య కరమైన నిందల్ని తాను భరించలేక పోతున్నట్లు చెప్పారు. అనుమాలిక్ వ్యాఖ్యల పై మండి పడ్డారు బాలీవుడ్ సింగర్ సోనా మొహాపాత్ర రియాక్ట్ అయ్యారు.

టీవీ షోలు చేస్తున్నప్పుడే తన మీద ఆరోపణలు చేస్తున్నారని.. తనకున్న జీవనోపాధి ఇదొక్కటేనంటూ అనుమాలిక్ సుదీర్ఘమైన వివరణ పై సోనా మండిపడ్డారు. అనుమాలిక్ కామాంధుడని.. తాను ఒక్కదాన్నే ఆరోపణ లు చేయటం లేదని.. చాలామంది బాధిత రాళ్లు ఉన్నారన్నారు.
తప్పు చేసిన అతని కే అంత బాధ ఉంటే.. అతని కారణంగా వేధింపుల కు గురైన తమ పరిస్థితి మరెలా ఉంటుందో ఆలోచించారా? అంటూ మండి పడ్డ ఆమె.. టీవీ షోల లో కనిపించే హక్కు అస్సలు లేదన్నారు. “నువ్వు ఎవరికీ రోల్ మోడల్ వి కావు.. కావాలంటే సెక్స్ రిహాబ్ కి వెళ్లి నీలో ఉన్న లైంగిక కోరికల్ని తగ్గించుకో” అని ఫైర్ అయ్యారు.

తాను 22 ఏళ్ల వయసు లో సంపాదించటం మొదలుపెట్టానని.. తనకు చేసిన తప్పునకు సారీ చెప్పి ఉంటే.. విషయం ఇంతవరకూ వచ్చేది కాదన్నారు సోనా. ఇద్దరు కూతుళ్లకు తండ్రివి అయినంత మాత్రాన మంచోడివి అయిపోవు. కూతుళ్లు ఉండి కూడా నీలో లైంగిక వాంఛలు తగ్గలేదు. నువ్వు లేకపోతే టీవీ షోలకు పోయేదేమీ లేదు. నీ కూతుర్ని ఉద్యోగం చేయమని చెప్పు.. నీ కుటుంబాన్ని పోషించమను” అంటూ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనుమాలిక్ ఇచ్చిన వివరణకు సోనూ ఇచ్చిన ఘాటు రియాక్షన్ ఇప్పుడు సంచలనగా మారింది.
Please Read Disclaimer