టీజింగ్ భరించలేక పెళ్లాడిన హస్కీ సింగర్!

0

ఒక్కోసారి కొన్ని గమ్మత్తయిన విషయాలు సినీపరిశ్రమలో హాట్ టాపిక్ గా మారుతుంటాయి. కొలీగ్స్ మధ్య సరదా టీజింగ్ ఒక్కోసారి సీరియస్ గా మారుతుంటుంది. నిరంతరం కెరీర్ పాకులాటలో ఎవరికి వారు బిజీ బిజీగా ఉండే ఈ చోట పర్సనల్ లైఫ్ విషయాల్లో కొలీగ్స్ ఫింగరింగ్ తప్పనిసరి. అలాంటి ఓ ఇన్సిడెంట్ ఓ హాట్ ట్యాలెంటెడ్ గాయని (సింగర్) పెళ్లికి కారణమైంది.

సహజంగానే గాయనీమణులకు ఓ తరహా టీజింగ్ ఉంటుంది. అదేదో పాటలో పాపులరైన పల్లవి లానే.. “పెళ్లెప్పుడవుతుంది బాబోయ్.. లగ్గమెప్పుడు పెడతారు బాబోయ్..“ అంటూ ఆట పట్టించే వాళ్లు ఉంటారు ఇక్కడ. అయితే అలా తనని ఓ కొలీగ్ కం ఫ్రెండ్ (ఒకే పరిశ్రమలో డిఫరెంట్ జాబ్స్) ఆట పట్టించినందుకు పౌరుషానికి పోయిన ఓ సింగర్ ఠపీమని తనకు నచ్చిన ఓ కుర్రాడిని వెతుక్కుని ఇంట్లో వాళ్లను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది. అప్పట్లో ఈ పెళ్లి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

ప్రస్తుతం ఆ ఇద్దరూ ఇండస్ట్రీలోనే కెరీర్ ని సాగిస్తున్నారు. టాలీవుడ్ టాప్ సింగర్ గా ఆ హస్కీ ఆయనీ మణికి గొప్ప ఇమేజ్ ఉంది. కుర్రకారులో విపరీతమైన ఫాలోయింగ్ కూడా ఉంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని హ్యాపీగా సెట్ చేసుకుని ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే ఓ బిడ్డకు జన్మను ఇచ్చి ఆ సెలబ్రేషన్ ని మరో స్థాయిలో కంటిన్యూ చేస్తోంది. టాలీవుడ్ ఊపు పెంచిన మాంచి రసవత్తరమైన పాటలు పాడిన సదరు సింగర్ పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ మునుముందు కెరీర్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించనుందట. సత్తా ఉన్న సింగర్ కాబట్టి తనకు ఛాన్సులిచ్చేందుకు స్టార్ డైరెక్టర్లు అంతే ఆసక్తి చూపిస్తున్నారట. రంగుల ప్రపంచంలో వ్యక్తిగత జీవితాన్ని.. వృత్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం అంత సులువేమీ కాదు. కానీ ఆ సింగర్ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ పదిమంది గాయనీమణులకు ఆదర్శంగా నిలుస్తోంది.
Please Read Disclaimer