కోలీవుడ్ పెద్దలపై సింగర్ ఫైర్

0

గాయని కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి మరో సారి గళం విప్పింది. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయం అంటూ ఉండదా? అని సినీ పెద్దల్ని సూటి గా ప్రశ్నించింది. బాధితురాల్ని బ్యాన్ చేసి.. నిందితుడి కి పార్టీలు ఇస్తారా? అని అడిగేసింది. కోలీవుడ్ పెద్దల నోట మాట రాని రీతిలో సోషల్ మీడియా లో ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి.

మీటూ ఉద్యమ వేళ లో తమిళ ప్రముఖుడు వైర ముత్తు మీద చిన్మయి సంచలన ఆరోపణలు చేశారు. తన అనుచరుడ్ని తన వద్దకు పంపి.. గదికి రావాలని పిలిచినట్లుగా చెప్పి వైర ముత్తును తీరును తప్పు పట్టింది. తననే కాదు పలువురు మహిళల్ని వైర ముత్తు వేధించేవాడని ఆమె ఓపెన్ అయ్యారు.

ఇది జరిగిన తర్వాత చిన్మయిని తమిళ చిత్ర పరిశ్రమ.. డబ్బింగ్ సంఘం నుంచి బ్యాన్ చేశారు. అయితే.. దానికి వెనుకాడని ఆమె.. వైర ముత్తుపై తరచూ వ్యాఖ్యలు చేస్తూ.. అతడి పై చర్యలు తీసుకోవాలని పోరాడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా చెన్నై లోని అల్వార్ పేట లో ప్రముఖ నటుడు కమల్ హాసన్ నిర్వహించిన కె.బాలచందర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ తో పాటు వైర ముత్తు కూడా హాజరయ్యారు.
దీనికి సంబంధించిన ఫోటోను షేర్ చేసిన ఆమె.. నిందితుడు వేడుకలకు హాజరవుతుంటే.. బాధితురాలు మాత్రం బ్యాన్ కు గురి అవుతుందంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఇదేం న్యాయం అంటూ సూటిగా ప్రశ్నిస్తున్న చిన్మయి కి తమిళ సినీ పెద్దలు బాసటగా ఎందుకు నిలవటం లేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.
Please Read Disclaimer