హాటు గాయని ఘాటు బికిని

0

నేహ భాసిన్ ఒక పాపులర్ సింగర్. అటు హిందీ నుండి ఇటు తెలుగు వరకూ ఎన్నో పాటలు పాడింది.. వాటిలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. అప్పుడెప్పుడో 11 ఏళ్ళ క్రితం ‘ఫ్యాషన్’ సినిమా లో కుచ్ ఖాస్ హై లాంటి మెలోడీల నుంచి ఈమధ్య సల్మాన్ ఖాన్ ‘భరత్’ లో చాష్ని వరకూ ఎన్నో పాటలు పాడింది. తెలుగులో చూస్తే ‘ఆపిల్ బ్యూటీ’.. ‘స్వింగ్ జరా’ లాంటి సాంగ్స్ ఉన్నాయి. ఈ భామ మిగతా సింగర్ల లాగా ట్రెడిషనల్ గా ఉండే రకం కాదు. హీరోయిన్లకు పోటీ అన్నట్టుగా గ్లామరస్ గా ఉండే బాపతు.

అసలు నేహ ఇన్స్టా ఖాతా చూస్తే ఎంత అల్ట్రా మోడరన్ అనేది అర్థం అవుతుంది. ఆ డ్రెస్సులు.. ఆ హెయిర్ స్టైల్స్ చూస్తే అమెరికన్ పాప్ సింగర్ ను చూస్తున్నామేమో అని మనకు అనుమానం వచ్చే అవకాశం ఉంది. ఈమధ్య ఈ భామ సడెన్ గా ఒక బికినీ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటో కు పెద్ద క్యాప్షన్ ఇచ్చింది. “ఒక నెల జీవన విధానంలో మార్పులు. మెరుగైన షేప్ లో కనిపించేందుకు. తినేవాటిలో స్వల్ప మార్పులు. వారానికి ఆరు రోజుల వర్క్ అవుట్. రైస్ తినడం తగ్గించాలి. జంక్ ఫుడ్ తినకూడదు. చీకటిపడే లోపే డిన్నర్ పూర్తి చేయాలి. సమయానికి నిద్రపోవాలి.. 7 గంటల నిద్ర ఉండాలి. ధ్యానం చెయ్యాలి. నాతో పాటుగా ఎవరు చేస్తారు?” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఇవన్నీ అందరూ చెయ్యాలని అనుకుంటారు కానీ ఎవ్వరూ చెయ్యరు. ఈ ఫిట్నెస్ ఫిలాసఫీల సంగతి పక్కన పెడితే నేహ బికిని అదిరిపోయింది. “ఏం హీరోయిన్లేనా మేము బికినీలు కొనుక్కోలేమా.. వాటిని వేసుకోలేమా.. ఇన్స్టాలో పోస్ట్ చెయ్యలేమా.. అమాయక నెటిజన్లను కాల్చుకు తినలేమా.. ఇప్పటినుంచి చూడండి నా తడాఖా” అన్నట్టుగా నిలుచుంది. ఈ ఫోటో లో నాభి రింగు హైలైట్. తలపై కొప్పు.. కళ్ళజోడుతో స్టైల్ ను మరింతగా పెంచింది. ఈ ఫోటోకు అదిరి పోయే కామెంట్లు వచ్చాయి. “సెక్సీ సింగర్”.. “హాట్ బెల్లీ.. హాట్ రింగ్”.. “గ్రేట్ బికినీ షేప్” అంటూ కొందరు రెచ్చిపోయారు. ఈ సింగర్ వ్యవహారం చూస్తుంటే ఫ్యూచర్ లో హీరోయిన్లు మోడల్స్ మాత్రమే కాకుండా అన్ని రంగాల వారు బికినీ ట్రెండ్ ను అందిపుచ్చుకునేలా ఉన్నారు.
Please Read Disclaimer