నువ్వైతావ్ రా లంగా.. రాహుల్ సిప్లిగంజ్ లొల్లి వీడియో వైరల్

0

‘అమెరికాపోయి నువ్వైతావ్ రా లంగా.. మాకేమో బెంగా.. ఆ కష్టం నష్టం నీకెందుకు బంగా..’ అంటూ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాడు బిగ్ బాస్ విన్నర్, పాప్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ఆయన పాడిన ‘ప్రెజర్ కుక్కర్’ మూవీ ప్రమోషనల్ సాంగ్ ‘నువ్వైతావ్ రా లంగా’ పాట రెండు మిలియన్ల వ్యూస్‌ని క్రాస్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బిగ్ బాస్ విన్నర్ కావడంతో రాహుల్ పాడిన పాటలకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. అంతకు ముందు రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాటలు మంచి మ్యూజికల్ హిట్ అయినప్పటికీ పెద్దగా అతనికి పేరు తీసుకురాలేకపోయాయి. అయితే బిగ్ బాస్ విన్నర్‌గా అవతరించిన తరువాత రాహుల్ పేరులో సినిమాను ప్రమోట్ చేసుకోవడం మనోడు క్రేజ్ ఏం రేంజ్‌లో పెరిగిందే అర్ధం చేసుకోవచ్చు. ‘నువ్వైతావ్ రా లంగా’ మూవీ ట్యాగ్ లైన్ ‘ప్రతి ఇంట్లో ఇదే లొల్లి’ తగ్గట్టే.. ఎప్పుడు ఎక్కడ చూసినా రాహుల్ లొల్లే పాట రూపంలో వినిపిస్తోంది.

రాహుల్ పాడిన ‘నువ్వైతావ్ రా లంగా’ పాట రెండు మిలియన్ల వ్యూస్‌ని క్రాస్ చేయడంతో థాంక్స్ చెప్తూ తన ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టాడు. ఈ సాంగ్‌ను పెద్ద హిట్ చేశారు.. ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మీకు తెలియని విషయం ఏంటంటే.. ఈ ప్రెజర్ కుక్కర్ మూవీలో రెండు పాటలను కంపోజ్ చేశా. ఒకటి ‘నువ్వైతావురా లంగా’, రెండు ‘హరి హో లింగా’. అలాగే నా ఫ్రెండ్ హర్షవర్దన్ రామేశ్వర్‌తో మరో సాంగ్ కంపోజ్ చేయించారు. ఈ సినిమా పాటల్ని పెద్ద హిట్ చేయాలని కోరుతున్నా’ అంటూ చెప్పుకొచ్చారు రాహుల్.




Please Read Disclaimer