అమ్మాయిగానే ఉన్నా.. అబ్బాయిగా మారలేదన్న సింగర్

0

ప్రముఖులకు కొత్త కష్టాల్ని తెచ్చి పెడుతోంది సోషల్ మీడియా. తాజాగా అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటోంది సింగర్ స్నిగ్ధ. సింగర్ గా.. నటిగా ఆమెకు మంచి పేరే ఉంది. చక్కటి వాయిస్ ఉన్నప్పటికీ.. ఆమె హెయిర్ స్టైల్.. వస్త్రధారణ అబ్బాయిని పోలిన రీతిలో ఉండటంతో.. ఆమె మీద కొత్త తరహా ప్రచారం మొదలైంది.

ఆమె అబ్బాయిగా మారిపోయినట్లుగా ఆమె పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది స్నిగ్ధ. దేవుడు తనను అమ్మాయిలా సృష్టించాడని.. తనకు మంచి వాయిస్ కూడా ఇచ్చాడని.. సింగర్ గా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయని.. అలాంటప్పుడు అబ్బాయిగా మారటానికి నేనెందుకు ప్రయత్నిస్తా? అని ప్రశ్నించారు.

అమ్మాయి కాస్తా.. అబ్బాయిగా మారాలంటే అదేమీ మంత్రం వేసినంత తేలికగా పూర్తి అయ్యేది కాదని.. అయినా తానెందుకు అబ్బాయిలా మారాలని అనుకుంటానని ప్రశ్నిస్తున్నారు. తాను అబ్బాయిలా మారతానని ఎవరైనా అనుకుంటే అది వారి మూర్ఖత్వమని.. ఎవరో ఏదో అనుకుంటే తనకు పోయేదేమీ లేదని తేల్చేసింది. తాజాగా ఇచ్చిన క్లారిటీ తర్వాత అయినా.. పనికిమాలిన ప్రచారాన్ని ఆపేస్తారో లేదో చూడాలి.
Please Read Disclaimer