మేటి గాయనికి చెట్టంత కొడుకు కూతురు

0

ఈ ఫోటోలో చెట్టంత ఎదిగిన ఆ కాలేజ్ బోయ్ ఎవరని అనుకుంటున్నారు. టాలీవుడ్ మేటి గాయని సునీత కుమారుడు. పేరు ఆకాష్. అప్పుడే గ్రాడ్యుయేషన్ లో అడుగుపెట్టాడు. కాలేజ్ క్యాంపస్ లో ఇదిగో ఇలా మామ్ సునీతతో కలిసి ఫోటో దిగాడు. అతడికి విషెస్ తెలియజేస్తూ ఫోటోని అభిమానుల కోసం సునీత స్వయంగా షేర్ చేశారు.

“డియర్ ఆకాష్.. గ్రాడ్యుయేషన్ ని ఎంజాయ్ చెయ్.. నీ ప్లాన్స్ విజయవంతం కావాలి. గాడ్ బ్లెస్ యు“ అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో కుమారుడు ఆకాష్ తో పాటుగా సునీత గారాల పట్టీ శ్రేయా గోపరాజు కూడా ఉన్నారు. శ్రేయా ఇంతకుముందు సవ్యసాచి చిత్రంలో ఓ పాటను పాడారు. అప్పట్లో ప్రీరిలీజ్ వేదికపైనా సందడి చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఫోటోకి సునీత ఫ్యాన్స్ నుంచి స్పందన బావుంది. “మీ కొడుకు మీ ఎత్తులోనే కాదు.. మీ వ్యక్తిత్వంలో కూడా మీకన్నా ఎత్తుగా ఎదగసాలని ఆశిస్తున్నాం“ అంటూ ఆనందం వ్యక్తం చేశారు ఓ అభిమాని. పలువురు అభిమానులు ఆకాశ్ కి శుభాకాంక్షలు తెలిపారు. బుల్లితెర- వెండితెర గాయనిగా సునీత ఎంతో ఎత్తుకు ఎదిగారు. తన వారసులు పెద్ద స్థాయికి ఎదిగేలా పై చదువులు చదివిస్తున్నారు. సునీత మీడియా పర్సనాలిటీ కిరణ్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన నుంచి విడిపోయి ప్రస్తుతం సింగిల్ మదర్ గానే ఉంటున్నారు. ఇటీవల సునీత రెండో వివాహం చేసుకుంటున్నారన్న వార్తలు వచ్చినప్పుడు వాటిని ఖండించారు. అదంతా సరే కానీ.. అప్పుడే చెట్టంత కొడుకు కూతురు తనకి అండగా నిలిచారని అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer